Sri Nataraja Swamy Temple, Chidambaram
శ్రీ నటరాజ ఆలయం, చిదంబరం శైవ సాంప్రదాయం లో శ్రీ నటరాజ స్వామి కొలువైన చిదంబర కనక సభను "కోవెల" అని అంటారు. స్వామివారిని రత్న సభాపతి అని పిలుస్తారు. నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో తొలి స్థానంలో ఉన్న శ్రీ రంగనాధుడు కొలువైన శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం మరియు పెరియ కోవిల్ అని గౌరవిస్తారు. అదే విధంగా రెండు వందల డెబ్బై అయిదు పడల్ పెట్ర స్థలాల లో అగ్రస్థానంలో ఉన్న చిదంబర ఆలయాన్ని "కోవెల" అని సగౌరవంగా సంభోదిస్తారు. భక్తులకు సంబంధించినంత వరకు ఈ రెండు సమాన హోదా కలిగినవి. ఆళ్వార్లు గానం చేసిన పాశురాల వలన శ్రీ వైష్ణవ దివ్యదేశాలు రూపొందాయి. అలానే శివ భక్తులైన నయమ్మార్లు గానం చేసిన పాటికాల కారణంగా పడల్ పెట్ర స్థలాలు అవతరించాయి. చిదంబరం గొప్పదనం అక్కడితో ఆగలేదు. పంచభూత స్థలాలలో ఒకటి. కంచి (భూమి), జంబుకేశ్వరం (జలం), తిరువణ్ణామలై (అగ్ని), శ్రీకాళహస్తి (వాయు)కాగా చిదంబరం లో ఉన్నది ఆకాశ లింగం (శూన్యము). అసలు చిదంబరం అనగా చిత్ - చైతన్యం, అంబరం - ఆకాశం....