పోస్ట్‌లు

MY BOOK ON TIRUVANNAMALAI

చిత్రం
                తిరువణ్ణామలై  మీద  నేను రాసిన పుస్తకం   ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న కార్యక్రమాన్ని ఆ అరుణాచలేశ్వరుని దయతో క్రిందటి జూన్ లో పూర్తి చేయగలిగానని సంతోషంగా తెలియచేసుకొంటున్నాను.  ఉద్యోగరీత్యా పర్యటనలు, కొంత కాలం అనారోగ్యం ఇలా కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకి ఈ పుణ్య క్షేత్ర వివరాలతో కూడిన ఈ చిన్ని పుస్తకాన్ని మీ అందరి ముందుకీ తేగలిగాను.  తమ విరాళాలతో ఈ ప్రచురణ జరిగేలా చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా శ్రీ లక్కరాజుశివ  రామకృష్ణా రావు మరియు శ్రీమతి భార్గవి దేవి (చికాగో, అమెరికా)దంపతులకు నా హృదయపూర్వక వందనాలు.  తొలి ముద్రణలో వెయ్యి పుస్తకాలు ప్రచురించాము. సప్త ముక్తి క్షేత్రం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం  వారణాసి లో పంచడం ఆరంభించి అనేక ప్రాంతాలలో భక్తులకు అందచేశాము. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హంపి లాంటి ప్రదేశాలలోని ప్రముఖ ఆలయాలలో కూడా చాలా మందికి అందచేశాము . కవర్ పేజీ  ఫస్ట్ బ్యాక్ పేజీ  బ్యాక్ కవర్ పేజీ ...

Sri Varadaraja Perumal Temple, Kanchipuram

చిత్రం
          శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం                             సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. వేగావతి నదీ తీరాన ఉన్న ఈ నగర గొప్పదనాన్ని గురించి చెప్పాలంటే " పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి" అన్న ఆర్యోక్తి ఉదాహరిస్తే  చాలు.  కాంచీపురం లో నెలకొన్న అనేకానేక దేవాలయాలలో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కామాక్షీ దేవి, శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. గతంలో వెయ్యికి పైగా దేవాలయాలు కంచి లో ఉండేవని చెబుతారు.  శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో ...