11, ఆగస్టు 2017, శుక్రవారం

MY BOOK ON TIRUVANNAMALAI

                తిరువణ్ణామలై  మీద  నేను రాసిన పుస్తకం 

ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న కార్యక్రమాన్ని ఆ అరుణాచలేశ్వరుని దయతో క్రిందటి జూన్ లో పూర్తి చేయగలిగానని సంతోషంగా తెలియచేసుకొంటున్నాను. 
ఉద్యోగరీత్యా పర్యటనలు, కొంత కాలం అనారోగ్యం ఇలా కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకి ఈ పుణ్య క్షేత్ర వివరాలతో కూడిన ఈ చిన్ని పుస్తకాన్ని మీ అందరి ముందుకీ తేగలిగాను. 
తమ విరాళాలతో ఈ ప్రచురణ జరిగేలా చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా శ్రీ లక్కరాజుశివ  రామకృష్ణా రావు మరియు శ్రీమతి భార్గవి దేవి (చికాగో, అమెరికా)దంపతులకు నా హృదయపూర్వక వందనాలు. 







తొలి ముద్రణలో వెయ్యి పుస్తకాలు ప్రచురించాము. సప్త ముక్తి క్షేత్రం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం  వారణాసి లో పంచడం ఆరంభించి అనేక ప్రాంతాలలో భక్తులకు అందచేశాము. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హంపి లాంటి ప్రదేశాలలోని ప్రముఖ ఆలయాలలో కూడా చాలా మందికి అందచేశాము .





కవర్ పేజీ 


ఫస్ట్ బ్యాక్ పేజీ 



బ్యాక్ కవర్ పేజీ 

బ్యాక్ కవర్ పేజీ లోపల 




పరిచయస్థులకు, బంధుమిత్రులకు కూడా స్వయంగా మరియు పోస్ట్ ద్వారా అందచేయడం జరిగింది. వెయ్యి పుస్తకాలలో 700 దాకా పంపిణీ చేసాము.
ఈ నెల 27వ తారీఖున జ్యోతిర్లింగ క్షేత్రం అయిన  రామేశ్వరం లో, 28న మధురై లో అదేవిధంగా 29న తిరువణ్ణామలై లో భక్తులకు అందచేసే కార్యక్రమం జరగనున్నది.
తిరువణ్ణామలై లోని భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రి స్వామి మరియు శ్రీ రామ సూరత్ కుమార్ ఆశ్రమాలలో కొన్ని పుస్తకాలు ఉంచడానికి నిర్ణయిచుకొన్నాము. కొన్నింటిని గిరివలయ మార్గంలో మరియు శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో భక్తులకు అందచేయడం జరుగుతుంది.
దీనితో తొలి ముద్రణలో వెయ్యి కాపీలలో 900 దాకా పంపిణీ చేయడం జరుగుతుంది.
రెండో ముద్రణకు తమ వంతు వితరణ ఇవ్వదలచిన వారు నా బ్యాంకు అకౌంట్ కి తమ విరాళాలను పంపగలరు. అదేవిధంగా తమ పూర్తి వివరాలను, చిత్రాలను నా మెయిల్ కి పంవలసినదిగా విజ్ఞప్తి.
పుస్తకాలు కావలసిన భక్తులు నన్ను సంప్రదించగలరు.
నా వివరాలు,
I J Venkateshwerlu, GF.2, Anu Residency, Srinivasa Nagar, Bank Colony, Vijayawada-520008
Mobile no. 09052944448. ijv291963@gmail.com
విరాళాలు పంపవలసిన బ్యాంకు వివరాలు ,
I J Venkateshwerlu, UCO BANK, M G ROAD Br. Vijayaeada. A/c no.17520110018934. IFSC code.
UCBA 0001752.

సర్వేజనా సుఖినోభవంతు !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...