Chebrolu Temples
చేబ్రోలు ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నచేబ్రోలులో అనేకానేక అద్భుత విశేష పురాతన ఆలయాలు ముఖ్యమైనవి. ఇవన్ని తొమ్మిదో శతాబ్దం నుండి పదునాలుగవ శతాబ్దాల మధ్య నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. చోళ, చాళుక్య, పల్లవ, కాకతీయ వంశ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ నిర్మాణాలు నేటికీ చెక్కుచెదరక నాటి నిర్మాణ ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. చేబ్రోలు హిందువులకే కాదు గతంలో బౌద్ధులకు కూడా పవిత్ర స్థలంగా ప్రసిద్ది చెందినట్లుగా లభించిన శిల్పాలు, శాసనాలు తెలియచేస్తున్నాయి. త్రవ్వకాలలో లభించిన శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని ఒక పీఠం మీద ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఊరంతా ఆలయాలు, మండపాలు, శిధిల పురాతన నిర్మాణాలు కనపడతాయి. శ్రీ ఆది కేశవ పెరుమాళ్, శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి, శ్రీ రంగనాధ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ నాగేశ్వర స...