Chebrolu Temples


                                        చేబ్రోలు ఆలయాలు 

మన రాష్ట్రంలో ఉన్నచేబ్రోలులో అనేకానేక అద్భుత విశేష  పురాతన  ఆలయాలు ముఖ్యమైనవి.
ఇవన్ని తొమ్మిదో శతాబ్దం నుండి పదునాలుగవ శతాబ్దాల మధ్య నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.



        



చోళ, చాళుక్య, పల్లవ, కాకతీయ వంశ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ నిర్మాణాలు నేటికీ చెక్కుచెదరక నాటి నిర్మాణ ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
చేబ్రోలు హిందువులకే కాదు గతంలో బౌద్ధులకు కూడా పవిత్ర స్థలంగా ప్రసిద్ది చెందినట్లుగా లభించిన శిల్పాలు, శాసనాలు తెలియచేస్తున్నాయి. 









 త్రవ్వకాలలో లభించిన శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని ఒక పీఠం మీద ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు.
ఊరంతా ఆలయాలు, మండపాలు, శిధిల పురాతన నిర్మాణాలు కనపడతాయి. 
శ్రీ ఆది కేశవ పెరుమాళ్, శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి, శ్రీ రంగనాధ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి మఱియు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి శ్రీ రాజ్య లక్ష్మీ,  ఆలయాలు ప్రధానమైనవి. 
వీటిల్లో పురాతనమైనదిగా గుర్తింపబడినది శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ఆలయం.




దీనిని తొమ్మిదో శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. 
అత్యంత నూతనంగా అంటే రెండువందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం. 
పంతొమ్మిదో శతాబ్దంలో రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. కానీ ఈ ఆలయమే ప్రధాన ఆకర్షణగా మారింది.





ఎందుకంటే మన దేశంలో బ్రహ్మ ఆలయాలు అతి తక్కువ. 
చిత్రమైన విషయం ఏమిటంటే  పేరు కానీ రూపంగానీ సృష్టి కర్తవి కాక పోయినా ఇది బ్రహ్మ ఆలయంగా పేరొందడం విశేషం. 
 ఈ ఆలయం చతురస్రాకార కోనేరు మధ్యలో ఉండటం అదనపు ఆకర్షణగా పేర్కొనాలి. 
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కూడా లోతైన పుష్కరణి మధ్యలో ఉంటుంది.















శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ గోపురం ఎత్తుగా చాలా దూరానికి కనపడుతుంది. 
ఈ ఆలయానికి దగ్గరలో సహజంగా లింగానికి ఎదురుగా ఉండాల్సిన నంది ప్రత్యేక మండపంలో ఉండటం మరో విశేష అంశం. 
ప్రతి ఆలయం లోనూ సర్ప రూపాలు చెక్కిన రాతి శాసనాలు కనిపిస్తాయి. 
























అన్ని పర్వదినాలలో భక్తులు విరివిగా వస్తుంటారు.
ఈ క్షేత్రం గురించిన అన్ని వివరాలతో కూడిన ఒక పుస్తకం అచ్చు వేయించి చరిత్రను వెలుగు లోనికి తేవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఈ చరిత్ర ప్రసిద్ది చెందినా చేబ్రోలు గుంటూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
చక్కని బస్సు సదుపాయం లభిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore