పోస్ట్‌లు

Tiruvannamalai

చిత్రం
                                అరుణాచల.... శివ.... అరుణాచల   తిరువన్నామలై అంటే చాలా మందికి వెంటనే తట్టక పోవచ్చు. అదే అరుణాచలం అంటే ప్రతివక్కరూ పరవశులవుతారు.  యుగ యుగాలుగా, శతాబ్దాలుగా స్కాంద పురాణము తో సహా అనేక పురాతన తమిళ గ్రంధాలలో, కీర్తనలలో ప్రముఖంగా పేర్కొన్న క్షేత్రం "అరుణాచలం".  అరవై మూడు మంది నయమ్మారులలొ దాదాపుగా అందరూ తమ తేవరాలలో అన్నామలయ్యను కీర్తించిన వారే ! ఎందరో ముముక్షువులకు మోక్ష మార్గం చూపిన మహోన్నత క్షేత్రం అరుణాచలం. నటరాజ స్వామి వాహనమైన నందీశ్వరుడు " సాక్షాత్తుగా సర్వేశ్వరుడు స్థిర నివాసమేర్పరచుకొన్న అరుణాచల వైభవాన్ని ఎంత వర్ణించినా తరగనిది" అని అన్నారంటే ఇక ఈ దివ్య క్షేత్రం గురించి ఏమని తెలపాలి.  అన్నామలై అంటే దుర్భరమైన లేదా అధిరోహించ లేని పర్వతం అని అర్ధం.  నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమేశ్వరుని సన్నిధి చేరడం అన్నది అంత సులభ సాధ్యమైన విషయం కాదు కదా ! అరుణాచలం అంటే ఎఱ్ఱని కొండ అని అర్ధం.  పంచ భూత స్థలాలలో అరుణాచలం అగ్ని క్షేత్రం....