Dupadu
శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి ఆలయం, దూపాడు ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం దోర్నాల మధ్య ఉన్న గ్రామం దూపాడు. శతాబ్దన్నర క్రిందట గ్రామానికి చెందిన వ్యాపారి సంతానం లేకపోవడంతో జోతిష్కుల సలహా మేరకు "శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి " ఆలయం నిర్మించారట. అచిరకాలం లోనే ఆయన కోరిక నెరవేరి నేడు వారసులు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో స్థిరపడి ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలుస్తోంది. ప్రధాన రహదారి మీద నుండే కనపడుతుంది నాలుగు అంతస్తుల రాజగోపురం. విశాల ప్రాంగణంలో గోపురానికి బయటే నాగ ప్రతిష్టలు ఉంటాయి. దక్షిణ ఉత్తర దిశలలో మండపాలు నిర్మించారు. ఉత్తర పక్క ఉన్న మండపంలో నూతనంగా సప్త మాత్రుకల, నాగ శిలలను, శ్రీ మహిషాసుర మర్ధని రూపాలను ప్రతిష్టించారు. ఈశాన్యంలో నవగ్రహ మండపం ఉంటుంది. గర్భాలయంలో శ్రీ చంద్ర మౌలేశ్వర స్వామి లింగరూపంలో కొలువై ఉండగా అమ్మవారు దక్షిణా ముఖిగా దర్శనమిస్తారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే స్వామికి ఎదురుగా రెండు నంది విగ్రహాలు, ధ్వ...