Dupadu

                   శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి ఆలయం, దూపాడు 


ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం దోర్నాల మధ్య ఉన్న గ్రామం దూపాడు. 
శతాబ్దన్నర క్రిందట గ్రామానికి చెందిన వ్యాపారి సంతానం లేకపోవడంతో జోతిష్కుల సలహా మేరకు "శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి " ఆలయం నిర్మించారట. 
అచిరకాలం లోనే ఆయన కోరిక నెరవేరి నేడు వారసులు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో స్థిరపడి ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలుస్తోంది.  

ప్రధాన రహదారి మీద నుండే కనపడుతుంది నాలుగు అంతస్తుల రాజగోపురం.
విశాల ప్రాంగణంలో గోపురానికి బయటే నాగ ప్రతిష్టలు ఉంటాయి.



దక్షిణ ఉత్తర దిశలలో మండపాలు నిర్మించారు.
ఉత్తర పక్క ఉన్న మండపంలో నూతనంగా సప్త మాత్రుకల, నాగ శిలలను, శ్రీ మహిషాసుర మర్ధని రూపాలను ప్రతిష్టించారు.








 ఈశాన్యంలో నవగ్రహ మండపం ఉంటుంది.
గర్భాలయంలో శ్రీ చంద్ర మౌలేశ్వర స్వామి లింగరూపంలో కొలువై ఉండగా అమ్మవారు దక్షిణా ముఖిగా దర్శనమిస్తారు. 
ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే స్వామికి ఎదురుగా రెండు నంది విగ్రహాలు, ధ్వజస్తంభం వద్ద శ్రీ దాసాంజనేయుడు కొలువుతీరి ఉండటం. 
హనుమంతుని శివాంశసంభూతునిగా పేర్కొంటారు కదా !




శివరాత్రి, కార్తీక మాస పూజలు రంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఆలయ పునర్నిర్మాణానికి ఎందరో భక్తులు తమ వంతు విరాళాలు అందించారు.

 నేటికీ సంతానాన్ని అభిలషించే దంపతులు ఈ ఆలయానికి వచ్చి భక్తి శ్రద్దలతో స్వామిని సేవిస్తే కోరిక నెరవేరుతుందని అంటారు.

ప్రశాంత పల్లె వాతావరణంలో ఉన్న సుందరమైన ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక మధురమైన అనుభూతి. 
వినుకొండ, త్రిపురాంతకం మరియు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చును. 

నమః శివాయ !

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore