Guntur Temples

                    శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం - కొలను కొండ 

విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే ప్రధాన రహదారిలో కృష్ణా నది మీద ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారధి దాటిన తరువాత పది కిలోమీటర్ల దూరంలో ఎడమవైపున ఉన్న చిన్న కొండ మీద ఒక ఆలయం కనపడుతుంది. 
అదే శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం. 
కొలనుకొండ గ్రామం. 
ఇక్కడి అత్యంత సారవంతమైన భూములలో పండే తాజా ఆకు కూరలు విజయవాడ నగరానికి పంపబడతాయి. 


ఏనాటి నుండి ఉన్నదో ఇక్కడి ఈ ఆలయం అత్యంత ప్రశాంత వాతావరణంలో మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 
పర్వత పాదాల వద్ద ఒక సదాశివుని ఆలయం ఉన్నది. 
ఆలయానికి తగినట్లుగా ధ్వజస్తంభం, బలి పీఠం ఉంటాయి. 

ధ్వజస్తంభం వద్ద గంధం పోసిన ఒక "జటాధరు" (?)ని విగ్రహం చాలా ప్రత్యేకతను నింపుకొని ఉంటుంది. 
ఇక్కడ కనిపించే శ్రీ వినాయక, నాగ ప్రతిష్టలు, పాద ముద్రలు గర్భాలయం లో ఎత్తైన రాతి మీద మనిషి రూపం చెక్కబడిన లింగం ఈ ఆలయం చాలా పురాతనమైనది అన్న భావం కలిగిస్తాయి. 
సరైన సమాచారం మాత్రం అందుబాటులో లేకపోవడం విచారకరం. 














క్రింద కొలువైన కైలాస పతిని దర్శించుకొని పక్కనే ఉన్న సోపాన మార్గం ద్వారా (సుమారు రెండు వందల మెట్లు) కొండ పై భాగానికి చేరుకొంటే మరో ఆలయం ఉంటుంది. 











ఉదయం లేదా సాయంత్రం పైనుండి పచ్చటి పొలాలను, దూరంగా వెళుతున్న వాహనాలను చూస్తూ స్వచమైన గాలిలో కొంత సమయం గడపటం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుంది.


విజయవాడ నుండి సులభంగా రోడ్డు మార్గంలో కొలను కొండ చేరుకొనవచ్చును. 
నమః శివాయ !!!






















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore