పోస్ట్‌లు

Kozhikode Beach

చిత్రం
                     ఒక అందమైన సాయంత్రం కోలికోడ్ సముద్ర తీరాన   హిందూ మహా సముద్రం లేదా బంగాళా ఖాతం సముద్ర తీరాల కన్నా అరేబియా సముద్ర తీరాలు బాగుంటాయన్నది గోవా, గుజరాత్, కర్నాటక (ఉత్తర ప్రాంతం ), కేరళలోని తిరువనంతపురం, చేరాయి చూసిన తరువాత నాకు ఏర్పడిన అబిప్రాయం.  ఉద్యోగరీత్యా పని పడి కోలి కోడ్ (కాలికట్) వెళ్ళవలసి వచ్చినది. సాయంత్రం మూడు గంటల కల్లా పని పూర్తి అయ్యింది. హోటల్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ కి  ఆటోలో చేరుకొన్నాము.   నగరంలోనే ఉన్న సాగర తీరాన ఎన్నో హోటల్లు, కార్యాలయాలు, గృహాలు ఉన్నాయి.  వాహనాల రాక పోకలతో ఎంతో రద్దీగా ఉన్నది ఇక్కడి రహదారి. అయినా ఎక్కడా ఇతరులకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ పద్దతిగా ఉన్న తీరు మెచ్చుకోదగినది. అన్నీ క్రమ పద్దతిలో సాగుతున్నాయి. అల్లరి మూకలు, తాగుబోతులు లేకపోవడం మరో మంచి విషయం.  విద్యాలయాలకు శెలవలు కావడంతో తీరం అంతా పిల్లలతో వచ్చిన పెద్దలతో, స్నేహితులతో కలిసి వచ్చిన యువతీ యువకులతో సందడి వాతావరణం నెలకొనివున్నది. అలలతో ఆటలాడుకొ...