శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం, మేల్పడి ఆలయాల రాష్ట్రం తమిళనాడులోని అనేకానేక చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు గల గ్రామాలలో ఒకటి మేల్పడి. వెల్లూరు జిల్లాలోని ఈ గ్రామంలో నెలకొల్పబడిన రెండు ఆలయాలది ప్రత్యేక స్థానం. వీటిల్లో ఒకటి శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం కాగా రెండవది శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం ఈ రెండు చారిత్రక నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. శ్రీ సోమనాధీశ్వర స్వామి వారి ఆలయాన్ని ఒకటవ పరాంతక చోళుడు నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలియవస్తోంది. పావన పాలరు నది కర్ణాటక రాష్ట్రం లోని నేటి చిక్కబళ్లాపుర జిల్లాలోని నంది కొండల్లో ఉద్భవించి తొలుత ఆ రాష్ట్రంలో తరువాత ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగం చివరికి తమిళనాడులో అత్యధిక భాగం ప్రవహించి చివరికి వయలూర్ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది పాలార్ నది. ప్రవాహ మార్గంలో సుమారు ఏడు దాకా ఉపనదుల ప్రవాహాన్ని తనలో కలుపుకొని వేలా...
పోస్ట్‌లు
జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది
Sri Mahamaya Temple, Ratanpur, Chattisgarh
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ముగురమ్మల రూపం మహామాయ దేవి ఉత్తరాదిన చాలా రాష్ట్రాలలో దేవదేవి కొలువైన క్షేత్రాలను "శక్తి పీఠాలు"గా పేర్కొంటారు. కానీ వీటిల్లో అధిక శాతం యాభై రెండు శక్తి పీఠాల్లో కనపడవు. అయినా వీటిని శక్తి పీఠాలుగా పిలవడానికి ప్రధాన కారణం ఆ క్షేత్రాలన్నింటిలో అమ్మవారు స్వయంవ్యక్తగా కొలువు తీరడమే ! మరో విశేషం ఏమిటంటే వీటిల్లో చాలా చోట్ల జగజ్జనని లింగ రూపంలో ఉండటం. అంతే కాకుండా ఆమె మహా సరస్వతి, మహా లక్ష్మి మరియు మహా కాళిగా ముగురమ్మల ఏక రూపిగా పూజలందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగని అక్కడ మూడు రూపాలు ఉంటాయి అనుకొంటే పొరబడినట్లే ! మూడు లింగ రూపాలు మాత్రమే ఉంటాయి. వాటికి పైన అలంకరణ చేసి అమ్మవార్లను ఆవాహన చేస్తారు. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో అనేక అమ్మవారి ఆలయాలు కనపడతాయి. దంతెవాడ శ్రీ దంతేశ్వరి దేవి, డోంగర్ గఢ్ మా బమలేశ్వరి దేవి విశిష్టమైనవి. వీటిల్లో చాలా మటుకు అక్కడ పాలించిన రాజ వంశాల వారి కులదేవతలుగా ప్రసిద్ధి. ఆలయాలను కూడా ఆ వంశాల వారే నిమించినట్లుగా తెలియవస్తోంది. అలాంటి పవిత్ర క్...