Sri Rama Theertham, Vizianagaram
శ్రీ రామ తీర్థం హిందువులకు ఆరాధ్య దైవం, ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్ర స్వామి. భారత దేశ నలుమూలలా ప్రతి ఒక్క పల్లెలో అయోధ్య రాముని ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. భదాద్రికి ( భద్రాచలం) సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట ( కడప జిల్లా), మరియు శ్రీ రామ తీర్థం ( విజియనగరం ). గతంలో ఒకటికి రెండు సార్లు ఒంటిమిట్ట సందర్శించుకొనే భాగ్యం లభించినది. ఈ మధ్య అనుకోకుండా శ్రీ రామ తీర్థం వెళ్ళే అదృష్టం దక్కింది. ఆ విశేషాలు అందరితో శ్రీ రామ నవమి సందర్భంగా పంచుకొందామని ఈ వ్యాసం పోస్ట్ చేస్తున్నాను. పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన మరియు నూతన నిర్మాణాలకు కూడలిగా ఉత్తరాంధ్ర లో ఉన్నప్ర...