Sri Swayamvyaktha Parvati sameta sri moksha amaralingeswara swami temple, Edara(Eluru dist)

భక్తులకు అపురూపం శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి నిరంతరం ఆలయ సందర్శన వ్యాపకంలో ఉండే నాకు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించినప్పుడు అనేక గొప్ప గొప్ప అనుభవాలు ఎదురైనాయి. కర్నూలు పట్టణానికి సమీపంలోని వామసముద్రం, కృష్ణా జిల్లా పెడన మండలంలోని చెన్నూరు, విజయవాడ నగరంలోని మొగల్రాజ పురం కొండ పైన ఉన్న శైవ క్షేత్రం మచ్చుకు కొన్ని! అలంటి అనుభవమే ఈ మధ్య నూజువీడు వెళుతున్నప్పుడు ఎదురైనది. ఆఫీస్ పని మీద వరసగా రెండు రోజులు నూజువీడు వెళ్ళవలసి వచ్చింది. మొదటి రోజు ఆగిరిపల్లి గ్రామంలో ఉన్న విశేష శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళాను. తిరిగి విజయవాడ వెళ్ళేటప్పుడు నెక్కలం అడ్డరోడ్డు దగ్గర శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నూతన సుందర ఆలయం, గతంలో రోడ్డు మీదకు ఉండిన శ్రీ ఆంజనేయస్వామికి నిర్మించిన నూతన ఆలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ పెట్టిన బోర్డు దృష్టిని ఆకర్షించింది. స్వయంవ్యక్త శ్రీ పార్వతీ సమేత శ్రీ మోక్ష అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం, ఈదర గ్రామం ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అని రాసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని గ్...