పోస్ట్‌లు

జూన్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Kalapathy vishwanatha Temple, Palakkad

చిత్రం
        శ్రీ కలపతి విశ్వనాథ స్వామి ఆలయం, పాలక్కాడ్                                పాలక్కాడ్ పరమేశ్వరుడు  పాలక్కాడ్ పట్టణం లోనే ఉన్న ఈ ఆలయం విశేష చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. అంతే కాదు చుట్టుపక్కల ఉన్న ఆలయాల నిర్మాణాలకు  నాంది పలికించింనది  కూడా  ఈ ఆలయమే ! చరిత్ర దానికది తయారు కాదు. కొందరి చేత సృష్టించబడుతుంది.  అలా  సృష్టించింది శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ దంపతులు. శివభక్తులైన ఈ దంపతులు వారణాసి వెళ్లి శ్రీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ విశాలాక్షి అమ్మవార్లను దర్శించుకొని, తమ గ్రామంలో కూడా ఇలాంటి కైలాస పతి ఆలయం ఉండాలని నిర్ధారించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కొన్ని శివలింగాలను, అమ్మవారి విగ్రహాలను తమ వెంట తెచ్చారు.  వీరి స్వగ్రామం పాలక్కాడ్ కు  పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లెన్ గోడ్. ఇక్కడ ఒక అద్భుత శ్రీ మహావిష్ణువు ఆలయం ఉన్నది. ఈ దంపతులు పాలక్కాడ్ పాలకుడైన ...

Malampuzha Dam

చిత్రం
                          మనోహరం మళంపుళ ఆనకట్ట                                                                                                  నేను కేరళ రాష్ట్రం లోని చాలా జిల్లాలలోని దర్శనీయ స్థలాలను సందర్శించాను. అస్సలు చూడని జిల్లాలు పాలక్కాడ్, కాసర్గోడ్ మరియు వేనాడ్. ఈ జూన్ మొదటి వారంలో నేను ఆఫీసు పని మీద త్రిసూర్ వెళ్లాల్సివచ్చింది.   నా మిత్రులు శ్రీ ఏకా ప్రసాదు, శ్రీ దాసరి ప్రసాదు కూడా నాతొ వచ్చారు. వారిద్దరి ప్రయాణం క్షేత్ర దర్శనం కోసమే ! త్రిసూరులో శ్రీ వడక్కు నాథర్, తిరువంబాడి శ్రీ కృష్ణ  ఆలయాలను దర్శించుకొని, గురువాయూర్ వెళ్ళాము. గురువాయూరప్పన్ ను సేవించుకొన్నాము.  పని పూర్తి అయిన తరువాత రెండో రోజు సాయంత్రం...