Sri Bala Koteswara Swami Tempe, Govada,

శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలిగించే వాతావరణం. అలాంటి ప్రశాంత పరిసరాల మధ్యలో దర్శనమిస్తుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కొలువైన గోవాడ దివ్య క్షేత్రం. మహేశ్వరుడు కొలువైన అనేక దివ్యధామాలు మనకు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినా శివలింగాలు వెలుగు చూస్తాయి. అంతగా విశ్వేశ్వరుని పట్ల అచంచల భక్తి భావాలు కలిగిన పవిత్ర భూమి మన భారత భూమి. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరిన గాథ యుగాల క్రిందటిదిగా పేర్కొనాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడానికి గల చారిత్రక ఆధారాలను చూద్దాము. చారిత్రక నిదర్శనాలు గతంలో ఈ ప్రాంతాన్ని చోళుల వంశం లో నుండి విడివడి ఇక్కడ స్థిరపడిన వారు అంటారు. అదే చరిత్రకారులు వీరు కన్నడ ప్రాంతానికి చెందిన పాలకవంశం అయిన చాళుక్య వారసులు అని పేర్కొంటారు. మరికొందరు వీరిని "వెలనాటి చోడులు" అని కూడా పిలుస్తారు. చారిత్రక సత్యం ఏది ఏమ...