Sri Panikeswara Swamy Temple, Panyam
కరములు ప్రసాదించిన కపర్ది తీర్ధయాత్రలు అనగానే ,మన ఆలోచనలు మరియు ప్రణాళికలు అన్నీ తమిళనాడు, కర్ణాటక లేదా ఉత్తర భారత దేశం వైపు మళ్ళుతాయి. మనరాష్ట్రంలో ఎన్నో విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగి , శిల్ప సౌందర్యాలను ప్రదర్శించే ఆలయాలు కలవు. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. అద్భుత ఆలయాలకు నిలయం కూడా ! అంతటి విశేషమైన సీమలో నేటికీ చక్కని ఆలయాలు, నిర్మాణాలు కనపడతాయి. ఒక్క రాయలసీమ లోనే కాదు కోనసీమ, కోస్తా ఆంధ్ర అన్నిచోట్లా చూడచక్కని దేవాలయాలు కనపడతాయి. స్థానికులు కూడా వాటి పట్ల ఆసక్తి చూపించకపోవడం విచారకరం. ప్రతి గ్రామం లేదా నగరంలో ఒక పురాతన ఆలయం కనపడటం మన రాష్ట్ర గొప్పదనం. వాటిని అభివృద్ధి చేసుకోలేకపోవడం, వాటిని గురించి ప్రచారం చేసుకోలేక పోవడం మన దురదృష్టం. ఈ విషయాలను పక్కన బెట్టి నేను ఈ మధ్యన దర్శించిన మరో పురాతన దేవాలయం విశేషాలను చూద్దాము. నవనంది క్షేత్రాల సీమ నంద్యాల పట్టణానికి సమీపంలోని "పాణ్యం" లో గొప్ప ఆలయం ఒకటి కలదు. మరికొన్ని పురాతన ఆ...