National Fossil Wood Park, Tiruvakkarai

                        జాతీయ శిలాజాల సముదాయం, తిరువక్కరై 

 పౌరాణికంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్న తిరువక్కరై చరిత్రలో కూడా విశిష్ట స్థానాన్ని సముపార్జించుకొన్నది. 
దానికి ఇక్కడ నెలకొల్ప బడిన "నేషనల్ ఫాజిల్ వుడ్ పార్క్" కారణం. 
జాతీయ భూగర్భ శాఖ వారి అధ్వర్యంలో ఉన్న ఈ కేంద్రం సుమారు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. 


 శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయానికి ఒక కిలోమీటరు  దూరంలో ప్రశాంత ప్రకృతిలో నెలకొల్పబడినది. అమ్మవారి దర్శనానంతరం కాలినడకన చేరుకోవచ్చును.


ప్రధమంగా ఈ శిలాజాలను 1781 వ సంవత్సరంలో ఇంగ్లీష్ శాస్త్రవేత్త "సోనేరేట్" కనుగొన్నారు. Mio-Pliocence Sedimentary rocks గా పిలిచే వీటి వయస్సు ఇరవై మిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించారు. (ఒక మిలియన్ అంటే పది లక్షల సంవత్సరాలు).


 శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇరవై మిలియన్ సంవత్సరాల క్రిందట సంభవించిన జలప్రళయంలో ఈ చెట్లు ఎక్కడి నుండో ఇక్కడి కొట్టుకొని వచ్చి నిలిచి పోయాయి. క్రమంగా శిలాజాలుగా మారిపోయాయి.



పార్క్ లోని కొంత భాగం లోనికి మాత్రమే సందర్శకులకు అనుమతి.  సుమారు రెండు వందల దాక వివిధ ఆకృతుల శిలాజాలను క్రమ పద్దతిలో అమర్చారు.  వీటిల్లో చింత, పైన్, దేవదారు లాంటి పుష్పించని జాతి, మరియు అనేక రకాల పుష్పించే జాతుల అవశేషాలున్నాయి.






దేశంలో వృక్ష శిలాజాల సంరక్షనాలయాలలో  తిరువక్కరై లో ఉన్నదే అధిక సంఖ్యలో నిక్షేపాలను కలిగివున్నది. తమిళనాడు లోని "సాతనూర్"లో మరొకటి ఉన్న అక్కడ ఒకే ఒక్క పదహారు అడుగుల నిక్షేపం ఉన్నది. అక్కడి చుట్టుపక్కల గ్రామాలలో కొద్ది సంఖ్యలో మరికొన్ని లభించాయి.






 ఈ శిలాజాలలో కొన్నింటికి వృక్షాల వయస్సును నిర్ధారించే "PHLOEM" & "XYLEM" అనే రెండు రకాల వలయాలు కాండంలో ఏర్పడతాయి. అవి కూడా స్పష్టం గా కనపడతాయి.

మరో ముఖ్య అంశం ఏమిటంటే వృక్ష శిలాజాలైన వీటిని తాకినా తట్టినా రాతి ని సృశించిన అనుభూతి కలుగుతుంది.



పార్క్ మొదట్లో మూడు వందల సంవత్సరాల మఱ్ఱి చెట్టు ఒకటి గతానికి వర్తమానానికి మధ్య వారధి లాగ నిలిచి ఉంటుంది.



వయస్సును నిర్ధారించే వలయాలు 











చరిత్రను తెలిపే ఈ స్థలాన్ని వీక్షించడం జీవితంలో ఒక మరుపురాని అనుభూతిగా మిగిలి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore