పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Ashta Veeratta Sthalams in Tamilnadu

చిత్రం
విశేష దర్శనీయ ఆలయాలు ఈ అష్ట వీరట్ట క్షేత్రాలు.  వీటిని గురించి వివరించిన నా వీడియో యూ ట్యూబ్ లో  చూడగలరు . Ashta Veeratta Stalams - Importance of Lord Shiva Temples - By I.Venkateswarlu (HD) Rose Telugu Movies ashta+veeratta+sthalams+on+youtube ashta+veeratta+sthalams+on+youtube

Sri Patan Devi Mandir, Patna

చిత్రం
                                శ్రీ పటాన్ దేవి మందిరం, పట్నా      దైవ భూమి అయిన భరత దేశంలో ఎన్నో ప్రాంతాలు స్థానికంగా కొలువైన దేవి లేదా దేవత నామం మీద ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే ! భూలోక వైకుంఠము శ్రీ రంగం, కలియుగ వైకుంఠము తిరుమల, శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువైన తిరువనంతపురం ఇలా ఎన్నో ఉదాహరణలుగా పేర్కొనవచ్చును.  వాటిల్లో గతంలో మన పురాణాలలో, చరిత్ర గ్రంధాలలో "మగధ"గా పేర్కొనబడిన నేటి "బీహార్" రాజధాని "పట్నా" పేరు కూడా చేర్చవచ్చును. "పుత్రకు"నిగా పేర్కొనబడే పాలకుని చేత స్థాపించబడిన "పాటలీ పుత్ర"  నేటి "పట్నా"గా మార్పు చెందడానికి వెనుక విశేష పౌరాణిక మరియు చారిత్రక గాధలు ముడిపడి ఉన్నాయి అని తెలుస్తోంది.  బడీ పటాన్ దేవి  దక్ష ప్రజాపతి గురించి అందరికీ తెలిసిన విషయమే ! ఆయన పుత్రిక "సతీ దేవి" తండ్రి మాటను కాదని శ్మశాన వాసి అయిన శంకరుని పరిణయ మాడటం వలన తండ్రి నిరాదరణకు గురి అయినది. సర్వేశ్వరుని కించపరచడానికి తలపెట్టిన యాగమనీ తమకు పిలుపు లేదనీ తె...

PARVATHAMALAI

చిత్రం
                                         పర్వతమలై     అయిదు సంవత్సరాల క్రిందట చెన్నైలో ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మొదటిసారిగా విన్నాను పర్వత మలై గురించి.  ప్రతి నెలా చేసే తిరువన్నామలై యాత్ర సందర్భంగా అక్కడివారిని ఆ క్షేత్ర విశేషాల గురించి తరచి తరచి అడిగే వాడిని. ఇంటర్ నెట్లో లభించిన సమాచారం చదివాను. యూ ట్యూబ్ లో పెట్టిన వీడియోలను చూసాను. ప్రతి సారీ వెళ్ళాలి అనుకోవడం ఏదో కారణంగా వెళ్ళలేక పోవడం.  చివరికి ఈశ్వరానుగ్రహంతో ఈ నెల ఒకటో తారీఖున పర్వతమలై సందర్శించే భాగ్యం లభించింది.       జవధి పర్వత శ్రేణి లో భాగం పర్వతమలై. రామరావణ యుద్ద సందర్భంగా ఇంద్ర జిత్తు ప్రయోగించిన అస్త్రం ప్రభావంతో లక్ష్మణుడు స్పృహ తప్పిపోయాడు. వానర వైద్యుడు శుషేనుని సలహా మేరకు  హనుమంతుడు ఆకాశ మార్గాన హిమాలయాలకు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని పెకలించుకొని తెచ్చాడు. ఆ క్రమంలో ఒక ముక్క విరిగి ఇక్కడ పడిందట. అందుకని ఈ కొండలు  అద...