18, జూన్ 2024, మంగళవారం

Bobbili Sri Venugopala swamy Temple, Machilipatnam

  శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం, మచిలీపట్నం

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలు నెలకొని ఉన్నాయి. మరీ ఎక్కువగా కృష్ణాతీరంలో పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అవన్నీ వివిధ పాలకుల కాలంలో ప్రతిష్టించబడినవిగా ఆధారాలు తెలియజేస్తున్నాయి. 
అలాకాకుండా ఒక చోట నుండి మరో చోటికి తరలించబడి రెండు చోట్లా విశేష ఆదరణ కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది. 













మచిలీ పట్నం 

క్రీస్తుశకం మూడవ శతాబ్దం లో కాకతీయుల పాలనలో ప్రముఖ సాగరతీర వ్యాపార కేంద్రంగా పేరొందినది మచిలీ పట్టణం. ఆ కాలంలో అధికార భాష సంస్కృతం మరియు ప్రాకృత. ఇక్కడ ఉండిన బందరు కోట వద్ద ఒక పెద్ద చేప విగ్రహం ఉండేదట. అందువలన మచిలీపట్టణం అన్న పేరు వచ్చింది అంటారు. 
 గతంలో ఈ సముద్రతీర ప్రాంతం నుండి రోమ్ కు నేత వస్త్రాలు ఎగుమతి జరిగేదట. ఇప్పట్లో ఈ ప్రాంతాన్ని గ్రీకు పర్యాటకులు సందర్శించారట. వారు తమ రచనలలో "మసూల లేక మససోలియా"అని పేర్కొన్నారట. కానీ అసలు పేరు "మహాశాలిపట్నం". అదే కాలక్రమంలో "మచిలీపట్నం" గా మారింది అనితెలుస్తోంది. బందరుగా కూడా ఈ ఊరు చాలా ప్రసిద్ధి. నేటికీ స్థానిక పెద్దలు మసూల అని అంటుంటారు. 
సహజ వర్ణాలతో ముద్రించే కలంకారీ వస్త్రాలకు, రకరకాల బంగారు పూత నగలకు ప్రసిద్ధి. బందరు లడ్డు రుచి  నిశ్వవిఖ్యాతం. 
ఈ నగరాన్ని కాంచీపురం  సమానమైనదిగా అంటారు. ఒకప్పుడు వెయ్యికి పైగా ఆలయాలు ఉండేవని చెబుతారు. నేటికీ కొన్ని విశేష ప్రత్యేక ఆలయాలు మచిలీపట్నంలో కనపడతాయి.పట్టణంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలూ, ఊర్లలో కూడా పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి. 
వాటిల్లో ఒకటి  బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. 










పూర్వ గాథ 

బొబ్బిలి రాజుల కులదైవం శ్రీ వేణుగోపాల స్వామి. నేటికీ బొబ్బిలి కోటలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చును. కానీ అక్కడ కొలువైన అర్చా మూర్తి తరతరాలుగా రాజ వంశీకుల పూజలు అందుకొన్నది. తరువాత కాలంలో ప్రతిష్టించినది. 
మరి అంతకు ముందు ఉన్న మూలవిరాట్టు ఏమైనది ?
బొబ్బిలి యుద్ధం కధ మనందరికీ తెలిసినదే కదా !
బలిష్టమైన, సుసంపన్నమైన బొబ్బిలి ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి విజయనగరాన్ని పాలిస్తున్న గజపతి రాజులు, ఫ్రెంచ్ వారు మరియు నైజం నవాబు సేనలు కలిసికట్టుగా ఒక్కసారి బొబ్బిలి మీద దండయాత్ర చేసి విజయం సాధించారు. ఆంధ్రదేశ చరిత్రలో పల్నాటి యుద్ధం తరువాత అంత ప్రసిద్ధి చెందిన యుద్ధం "బొబ్బిలి యుద్ధం". 
ఆ సమయంలో పరాయి వారి దాడిలో కులదైవం అయిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసే అవకాశాలున్నందున సైన్యంలో పనిచేసే బందరు ప్రాంత వాసులు మూలవిరాట్టును తీసుకొని రహస్య మార్గాలలో ప్రయాణించి మచిలీపట్టణం చేరుకొన్నారు అని చరిత్ర చెబుతోంది. 
రాజవంశానికి విశ్వాసపాత్రులు, మం ధర్మం పట్ల గౌరవం కలిగిన సైనికులు శ్రీ వేణుగోపాల స్వామి మూర్తిని ఒక మంచం మీద ఉంచి కనపడకుండా దుప్పటి కప్పి తెచ్చారట. దారిలో శత్రుసైనికులు ఆపి విషయం అడిగితే జబ్బుపడిన వ్యక్తిని వైద్యుని వద్దకు తీసుకొని వెళుతున్నాము అని చెప్పేవారట. అనుమానంతో వారు రోగి మూలగడం కూడా లేదేమని ప్రశ్నిస్తే వీరు వెంటనే "పలుకవేమి గోపాలా " అని అరిచేవారట. దానికి మంచం మీద మూర్తి నుండి "ఊ" అన్న శబ్దం వినిపించేదట. అందుకే "పిలిస్తే పలికే వేణుగోపాలుడు" అని నేటికీ భక్తులు నమ్ముతారు.         అలా  సైనికులు ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా పరమాత్మ మీద విశ్వాసంతో తాము సేవిస్తున్న రాజవంశం పట్ల గౌరవంతో ప్రయాణించారట. బొబ్బిలి నుండి బందరు చేరుకోడానికి వారికి ఇరవైఒక్క రోజులు పట్టినదట. 
ఈ కారణంగా శ్రీ కృష్ణజన్మాష్టమిని ఇక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. 
యుద్ధానంతరం బొబ్బిలి రాజవంశం వారు వచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్టించారని తెలుస్తోంది. 








ఆలయ విశేషాలు 

విశాల ప్రాకారానికి తూర్పు ముఖంగా మూడు అంతస్థుల రాజా గోపురం నూతనంగా నిర్మించారు. 
రాజగోపురానికి వెలుపల రవి మరియు వేప వృక్షాలు జమిలిగా ఉన్న స్థలంలో నాగ ప్రతిష్టలు కనపడతాయి. చాలా సాదాసీదా ఆలయం. ప్రత్యేకంగా శిల్పాలు, చెక్కడాలు కనిపించవు. 
ప్రాంగణంలో ఆకాశాన్ని తాకేలా ఎత్తైన ధ్వజస్థంభం మరియు బలి పీఠాలు ఉంటాయి. కళ్యాణ మండపం మరియు ఆస్థాన మండపం ఏర్పాటు చేశారు.  
పురాతన ఆలయానికి చక్కగా రంగులు వేశారు. విశాల  ప్రాంగణం శుభ్రం గా కనిపిస్తుంది. 
గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి నయనమనోహరంగా దర్శనమిస్తారు. 
నిత్య పూజలు జరిగే ఈ కోవెల దాయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరవబడి ఉంటుంది. 
ఆలయంలో శ్రీ కృష్ణజన్మాష్టమి ఘనంగా ఇరవైఒక్క రోజులపాటు నిర్వహిస్తారు. శ్రీ రామనవమి, ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. 
అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. 







మచిలీపట్నం నిజం పేట లో ఉన్న ఈ ఆలయాన్ని బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి కూడా సులభంగా చేరుకోవచ్చును. 
మచిలీపట్నంలో శ్రీ పాండురంగస్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం తప్పక చూడవలసినవి. మంగినపూడి సముద్రతీరం ఆహ్లాదకరం. 

 
ఈడేపల్లి శక్తి భవానీ ఆలయం 


శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో శ్రీ ఈడేపల్లి శక్తి భవాని ఆలయం ఉంటుంది. 
రహదారి మధ్యలో ఎన్నో ఏళ్ళ క్రిందట నిర్మించబడిన ఆలయం. శక్తి పఠాలు ఇతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దసరానవరాత్రుల్లో వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. 
ఎత్తైన పీఠం మీద అమ్మవారు ప్రశాంత వదనంతో దర్శమిస్తారు. 
అమ్మ దర్శనం సర్వ శుభకరం అన్నది బందరు వాసుల విశ్వాసం. 













గడచిన శ్రీ రామనవమికి మచిలీపట్నంలోని మా మామగారి ఇంటిలో జరిగే శ్రీ రామ కల్యాణానికి  వెళ్ళినప్పుడు పై రెండు ఆలయాలను సందర్శించుకునే అవకాశం లభించినది. 
డాక్టర్. అయ్యగారి అశ్వనీ కుమార్ మచిలీపట్నంలో పేరొందిన డాక్టర్. ఎనిమిది పదుల పైచిలుకు వయస్సులో కూడా ఇప్పటికీ అదే ఓపికతో రోగులను పలకరింపుతోనే స్వాంతన చేకూర్చే నేర్పు ఓర్పు వారి సొంతం.
శ్రీ అశ్వనీ కుమార్ గారు నాకు పెదమామగారు. 
నేను రాసిన ప్రతి వ్యాసాన్ని చదివి నాతొ చర్చించడమే కాక సలహాలు ఇస్తుంటారు. 
వారు పుట్టిపెరిగిన బందరు ఆలయాల గురించి రాసి పోస్ట్ చేస్తున్న ఈ వ్యాసాన్ని భక్తిపూర్వకంగా వారికి 












































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...