Dwaraka Tirumala

ద్వారకా తిరుమల వాసా గోవిందా గోవిందా !!!! భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు స్థిరపడ్డారో అక్కడ మరో హిందూ దేవీ దేవత ఆలయం లేకున్నా ఒక కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయం మాత్రం తప్పక కనపడుతుంది. ఏడుకొండల మీద యుగాల క్రిందట కొలువైన శ్రీవారి పట్ల భారతీయులకు గల భక్తిప్రపత్తులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. విదేశాలలోనే కాదుమన దేశంలో కూడా ఎన్నో శ్రీ బాలాజీ ఆలయాలు నెలకొని ఉన్నాయి. కానీ చిత్రంగా మన రాష్ట్రంలో పెద్ద తిరుపతితో పాటు చిన్న తిరుపతి కూడా ఉన్నది. పశ్చిమ గోదావరి ( ప్రస్తుత ఏలూరు జిల్లా)లో ఉన్న ద్వారకా తిరుమల పుణ్య క్షేత్రం యుగ యుగాల నుండి "చిన్న తిరుపతి" ప్రసిద్ధి చెంది పిలువబడుతోంది. ఎన్నో విశేషాల నిలయమైన ద్వారకా తిరుమల త్రేతాయుగానికి ముందు నుండి ఉన్నది అని క్షేత్ర పురాణ గాథ తెలుపుతున్నది. క్షేత్ర గాథ కృతయుగంలో "ద్వారక మహర్షి" శ్రీ మహా విష్ణువు" దర్శనాన్ని అపేక్షిస్తూ వందల సంవత్సరాలు తపస్సు చేశారట. ఎత్తైన చీమల పుట్టలు ఆయన చుట్టూ ఏర్పడినాయట. మహర్షి దీక్ష భక్తి ప్రపత్తులకు సంతసించిన వై...