Gundla Bramheswaram

                                         గుండ్ల బ్రహ్మేశ్వరం 

మూడు జిల్లాలకు విస్తరించిన నల్లమల అరణ్యాలలో ఒక భాగం గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం. 
కర్నూల్ మరియు ప్రకాశం జిల్లాలలో పన్నెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దట్టమైన అడవులు ఎన్నో అరుదైన వృక్షాలకు, వన మూలికలకు ప్రసిద్ది. 
పెద్ద పులులు, చిరత పులులు, ఎలుగు బంట్లు, అడవి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, దుప్పులు, జింకలు, కోతులూ మొదలైన జంతువులకు నివాసమీ అరణ్యాలు. 







గుంటూరు నంద్యాల రైలు మార్గంలో ఉన్న దిగువమెట్ట రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉంటుంది ఈ అభయారణ్య ప్రవేశ
ద్వారం.  అక్కడ నుంచి సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే అటవీ శాఖ వారి విశ్రాంతి గృహం వస్తుంది.
అటవీ శాఖ వారికి తప్ప మిగిలిన వారికి ప్రవేశం లేదు. అనుమతి తీసుకోవాలి.







గుండ్లకమ్మ నది పుట్టిన ప్రాంతం కావడం వలన మరియూ అశ్వద్దామ ప్రతిష్టిత "శ్రీ బ్రహ్మేశ్వర స్వామి"వారి పురాతన ఆలయం ఉండటం వలన ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.




































చిక్కటి అడవి మధ్యలో నీటి గుండాల మధ్యలో ఉండే శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి భక్తులకు ఒక్క శివరాత్రి నాడే  అవకాశం లభిస్తుంది. అదీ తోలి వంద వాహనాలనే అనుమతిస్తుంది అటవీశాఖ.







అనేక పురాతన శిధిల శిల్పాలు  ఉంటాయి.
అత్యంత ప్రశాంత వాతావరణం కలిగిన ఈ ప్రదేశంలో నేటికీ అనేక మంది సిద్దులు అదృశ్య రూపంలో శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామిని సేవిస్తూ తపస్సు చేస్తుంటారని అంటారు.






ద్రోణ పుత్రుడైన అశ్వద్దామ 













క్రిందటి శివరాత్రికి అక్కడికి వెళ్ళిన మిత్రులొకరు పంపిన చిత్రాలను ఈ బ్లాగ్ ద్వారా అందరితో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను.
శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహిస్తే వచ్చే శివరాత్రికి దర్శించుకొనే అదృష్టం దక్కుతుందని ఆశిస్తూ ........










పులి కాలి ముద్రలు 



నమః శివాయః !!!!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore