Mithranandapuram Trimurthy Temple, Tiruvananthapuram

మిత్రానందాపురం త్రిమూర్తి ఆలయం, తిరువనంతపురం హిందూ పురాణాల ఆధారంగా మనకున్న దేవీ దేవతలు ముక్కోటిమంది. అందులో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులది అగ్రస్థానం. స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు కు లయకారకుడైన సదాశివునికి పృధ్విలో ఎన్నో ఆలయాలున్నాయి. వ్యాప్తిలో ఉన్న అనేక కారణాల కారణంగా సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవునికి భువిలో పూజార్హత లేకుండా పోయింది. అయినా కమలాసనునికి దేశంలోని కొన్నిప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రాజస్తాన్ లోని పుష్కర్ లో ఉన్నది. అయితే త్రిమూర్తులు ముగ్గురూ ఒకే చోట కొలువైన క్షేత్రాలు బహు అరుదుగా కనపడుతుంటాయి.ఇలాంటి అరుదయిన క్షేత్రాలు అరుదైన ఆలయాల నిలయమైన కేరళలో ఎక్కువగా ఉండటం విశేషం. మలప్పురం జిల్లాలోని "తిరునవయ" మరియు రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలోని మిత్రానందపురం త్రిమూర్తి క్షేత్రం వీటిల్లో ముఖ్యమైనవి. ఈ రెండు క్షేత్రాలలోని ప్రధాన వత్యాసం ఏమిటంటే తిరునవయలో త్రిమూర్తుల ఆలయాలు కేరళ గంగ గా ప్రసిద్ది చెందిన భరత్ పుళ నదికి ఇరుపక్కలా ఉంటాయి. మిత్రానందపురంలో ఒకే ప్రాంగణంలో ...