28, సెప్టెంబర్ 2014, ఆదివారం

Sri Puri Jagannatha swamy Temple, Vishakhapatnam

                    శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయం, విశాఖపట్టణం 

సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం కొందరు భక్తులు విశాఖ నుండి ఒడిశా రాష్ట్రం లో పురుషోత్తముడు జగన్నాధునిగా కొలువుతీరిన పూరి క్షేత్రాన్ని సందర్శించుకోన్నారట. 
సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన ఈ దివ్య ధామ సందర్శనం వారిలో అపురూప ఆధ్యాత్మిక భావాలను వారిలో నెలకొల్పినది. 
 తమ ఊరు తిరిగి వచ్చిన తరువాత వారంతా కలిసి జగన్నాధునికి ఒక ఆలయం నిర్మించాలన్న నిర్ణయం తీసుకొన్నారు. 
అలా ఆ భక్తుల సంకల్పంతో నిర్మించబడినదే నగరంలో పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న శ్రీ జగన్నాథ మందిరం. 


తొలి తరం నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనే ఈ ఆలయంలోని శిల్పాలు, కట్టడాలు నేటికీ ఆకర్షణీయంగా ఉంటాయి. 











నిత్య పూజలతో ప్రతి నిత్యం ఎందరో భక్తులతో కళ కళ లాడే ఈ ఆలయంలో జగన్నాథ రధ యాత్ర కూడా ఘనంగా నిర్వహిస్తారు. 

 జై జగన్నాథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...