23, జనవరి 2014, గురువారం

Pinjore Gardens (also known as Pinjor Gardens or Yadavindra Gardens)

                         పింజోర్ గార్డెన్స్ ( యాదవేంద్ర ఉద్యానవనము )

పింజోర్ గార్డెన్స్ చండీఘర్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పింజోర్ గ్రామంలో ఉన్నది. 
అందువలన పింజోర్ గార్డెన్స్ అంటారు. 
పదిహేడో శతాబ్దంలో మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్ సవతి సోదరుడు అయిన "నవాబ్ ఫిదై ఖాన్" రూపకల్పన చేసాడు. 
తరువాత పటియాల రాజు అయిన మహారాజా  యాదవేంద్ర సింగ్ గౌరవార్ధం ఆయన పేరు పెట్టారు. 
వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఉద్యానవనం ఒక రోజును ప్రకృతితో మమేకం అయ్యే అవకాశం కలిగిస్తుంది.





మొఘల్ ఉద్యానవనం మాదిరి రూపొందించబడినది. 
చుట్టూ ఎత్తైన బురుజులు ఉంటాయి. 
ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉద్యానవనంలో లభించే సౌకర్యాల వివరాలు, చరిత్ర తెలిపే పలకాలు పెటారు. 
మనిషికి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు లోపలి వెళ్ళడానికి.








ఉద్యానవనం వెలుపల రైలు, ఒంటెలు, గుర్రాలు ఉంటాయి. 
పిల్లలు వాటిమీద తిరగవచ్చును. 
ఇందులోని భవనాలను రాజస్థానీ మరియు మొగలాయి నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. 
నలువైపులా ఎత్తైన చెట్లు, పూల మొక్కలు, 
ఉద్యానవనం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించారు. 
మొదట శీష్ మహల్ ( అద్దాల మేడ ) ఇక్కడే హవా మహల్ కూడా ఉంటుంది. 
రెండవది రంగ్ మహల్ 
మూడవది జల్ మహల్. 
పచ్చ ధనంతో కనులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ జల యంత్రాలతో నీరు వెదజల్లుతూ చల్లదనాన్ని కలిగిస్తూ సందర్శకులకు కావలసిన హృదయానందాన్ని అందిస్తుంది యాదవేంద్ర ఉద్యానవనం. 
ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో విద్యుత్ దీపకాంతులలో సప్త వర్ణాలో కనిపించే జల మహల్ వద్ద గడపటం ఒక జీవిత కాలం మరిచిపోలేని అనుభవం.  






లోపల భోజన శాలలో  అన్నిరకాల పదార్ధాలు లభిస్తాయి. 






 ఉద్యానవనంలో ఇష్టానుసారం సంచరించే రకరకాల పక్షులు, కోతులు, ఉడతలు లాంటి చిన్న జీవులు అదనపు ఆకర్షణ.
పక్కనే చక్కని శిల్పాలతో నిండిన  భీమా దేవి ఆలయాన్నితొలుత  పాండవులు నిర్మించినట్లుగా చెబుతారు.
  














పింజోరే గార్డెన్స్ చండీఘర్ నుండి సులభంగా చేరుకొనవచ్చును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...