sri sowmyanatha swamy temple, Nandalur
నంద నందనుడు కొలువైన నందలూరు శ్రీ మహా విష్ణువు భూలోకంలో అనేకానేక రూపాలలో, ఎన్నో నామాలతో కోవెలలో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబదుతున్నాడు. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ హరి సౌమ్య నాధ స్వామి గా వెలసిన క్షేత్రం నందలూరు. నందనందనుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి నందలూరు అన్న పెరోచ్చినదని చెబుతారు. సుందర శిల్పాలతో కళకళలాడే ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా పరిగణించవచ్చును. పౌరాణిక గాధ : లోక కంటకుడైన హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రత్వం తగ్గలేదు. అరణ్యంలో చెంచు వనిత రూపంలో లక్ష్మి దేవి సహచర్యంతో స్వామి సౌమ్యుడైనాడు. ఆ రూపనికే సౌమ్యనాదుడు అని పేరు. తొలుత నిరంతరం నారాయణ నామాన్ని జపించే నారద మహర్షి ఇక్కడ ఎన్నో పురాణాలలో పేర్కొన్న బాహుదా ( చెయ్యేరు) నదీ తీరంలో ప్రతిష్టించారని స్థానికంగా ఒక కధనం ప్రచారంలో ఉన్నది. నారద ప్రతిష్టిత శ్రీ సౌమ్యనాధ స్వామికి దేవతలే ఆలయం నిర్మించారని, కాల గతిలో అది శ...