VANGIPURAM

                                          వంగిపురం 


గుంటూరు జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాడు, అబ్బినేనిగుంట పాలెం, రావిపాడుల మీదగా వంగిపురం చేరుకోవచ్చును. 
క్రీస్తుపూర్వం నుండి ఇక్కడ జనవాసలున్నాయని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. 
పౌరాణికంగా కూడా వంగి పురం ఎంతో ప్రసిద్ది పొదినదిగా ప్రచారంలో ఉన్న గాధల ద్వారా అవగతమవుతుంది. 
ఇక్కడ యుగాల నాటి గాధలకు ప్రతిరూపాలైన రెండు విశేష ఆలయాలున్నాయి. 
ఒకటి శ్రీ వల్లభరాయ స్వామి ది కాగా రెండవది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం . 
సుమారు 11 వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించిన ఆలయలివి .







శ్రీ వల్లభరాయ స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తారు. మూలవిరాట్టులో గమనించదగ్గ అంశం ఏమిటంటే కుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రం ఉంటాయి. దీనికి కారణం శ్రీహరి గజేంద్రుని మొసలి బారినుండి కాపదినదిక్కడే నని సిరికిన్ చెప్పడు శంఖు చక్రంబు చేదోయి సంధింపడు అన్నట్లుగా వైకుంఠము  నుండి పరుగు పరుగున వచ్చేసే క్రమంలో అవి తారుమారైనట్లు గా చెబుతారు . అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మి.
 . స్వామిని సంతాన వల్లభుదని, విజయ వల్లభుడని భక్తులు పిలుచుకొంటారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతాయి. మాఘ మాసంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 
అతి పురాతనమైన ఈ ఆలయంలో సుమారు వెయ్యి సంవత్సరాల నాటి శాసనాలెన్నో ఉన్నాయి. 



రెండో ఆలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారిది. 




శ్రీ వల్లభ రాయ స్వామి ఆలయానికి సమీపంలో చెరువు గట్టున ఉండే ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్టించారట. తదనంతర కాలంలో చోళరాజులు గర్భాలయాన్ని నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట కీర్తి శేషులు శ్రీ వల్లూరి ఆనందయ్య గారు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించి, పూజాదుల నిమిత్తం కొంత పొలాన్ని కూడా ఇచ్చినట్లుగా ఆలయ గోపురం మీద ఉన్న శిలా శాసనం తెలుపుతోంది. పద్దెనిమిది తరాలుగా వారి వంశం వారే ఆలయ అర్ఛకులుగా ఉంటున్నారు. ప్రస్తుత అర్ఛకులు 
శ్రీ అగస్తీశ్వర స్వామి. గర్భాలయంలో లింగరూప సదాశివునికి చేసే ప్రత్యేక అలంకరణ తో కైలాసనాధుదు విగ్రహా రూపంలో కొలువైన అపురూప భావన భక్తులకు కలుగుతుంది. 


నమస్కార మండపంలో శ్రీ గణేశుడు, శ్రీ పార్వతీ అమ్మవారు కొలువుతీరివుంటారు. ముఖమండపంలో అష్టభుజ శ్రీ వీరభద్రస్వామి, శ్రీ భద్రకాళి అమ్మవారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. ఈ విగ్రాహాలన్ని ఆలయ నిర్మాణ సమయంలో జరిపిన త్రవ్వకాలలో లభించినవి కావడం విశేషంగా చెప్పుకోవాలి. 


శ్రీ అగస్తీశ్వర స్వామి అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పరీక్షలలో విజయాన్ని కలగ చేస్తాడని ఎందరో విద్యార్ధులు ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా  తమ హాల్ టికెట్లతో పూజ చేయించుకోడానికి
వస్తారు. 
కార్తీక మాస పూజలు, శివరాత్రి, గణపతి నవరాత్రులు, దసరా ఉత్సవాలు జరుపుతారు. మార్చి అంటే ఫాల్గుణ మాసంలో శ్రీ ఆగస్తీశ్వర స్వామి వివాహ వేడుకలను వైభవంగా చేస్తారు. 
ఎంతో పౌరాణిక చారిత్రక విశిష్టతలకు నిలయమైన వంగిపురంకు గుంటూరు నుండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore