పశు పక్ష్యాదులకు కూడా ప్రత్యేక రోజులున్నాయిట మనందరం ఉన్నంతలో ఆనందంగా, తాహతుకు తగినట్లుగా ఆర్భాటంగా జరుపుకొనేది పుట్టిన రోజు వేడుకలను. మనది లేదా మన కుటుంబ సభ్యుల జన్మదినోత్సవ సందర్బంగా ఒకరికొకరు శుభాకాంక్షలు అందుకోవడం లేదా తెలపడం, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపడం ఆ రోజున సహజంగా చోటుచేసుకునే పరిణామాలు. అది ఒక ప్రత్యేకమైన రోజు మనందరికీ. మరి మనతో పాటు ఈ భువిలో నివసించే పశు పక్ష్యాదులు సంగతేమిటి ? వాటికి నోరు లేదాయ పాపం. ఏమి చేయాలి ? ఎక్కడో పుడతాయి. మరెక్కడో మరణిస్తాయి. జీవించడానికి ఎన్నో పాట్లు పడుతుంటాయి. భావాలను వ్యక్తపరచడానికి మనకంటూ బాష ఉన్నది. మాట్లాడగలం. కానీ మన వలన పర...
పోస్ట్‌లు
ఫిబ్రవరి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది
Shraddha Narayana Temple, Nenmeli
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

సద్గతులను ప్రసాదించే శ్రాద్ధ నారాయణుడు ప్రజలు ఆలయాలకు వెళ్లి కొలువు తీరిన దేవీదేవతలకు తమ కోరికల చిట్టా తెలుపుతూ నెరవేర్చమని అర్ధిస్తుంటారు. వీటిల్లో అధికభాగం ఇహలోక సుఖాలే ఉంటాయి. ఇవి బొందిలో జీవం ఉన్నంత వరకూ ఒకదాని తరువాత మరొకటి చొప్పున కొనసాగుతూనే ఉండటం ఆ అందరికీ తెలిసిన విషయమే ! ఒకోసారి ఈ తాపత్రయం మరణానంతర లేదా మరో జన్మకు సంబంధించిన విషయాల పట్ల కూడా ఉండటం విశేషం. కానీ సమస్త జీవులను క్షమించి ఆదరించి వారి కోర్కెలను నెరవేరుస్తారు పరాత్పరుడు. ఆ విధమైన అదృష్టానికి నోచుకొన్న ధన్య జీవులైన దంపతుల కారణంగా అందరికీ లభించిన ఒక అరుదైన ఆలయం తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు పట్టణంలోని శ్రీ శ్రాద్ధ నారాయణ పెరుమాళ్ కోవెల. చాలా చిన్నగా మన వాడకట్టులో కనపడే అతి సాధారణ నిర్మాణంలాగ కనిపించే శ్రీ మహా లక్ష్మి సమేత శ్రీ నారాయణ పెరుమాళ్ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. గతంలో ఈ క్షేత్రాన్ని "పుండరీక నల్లూరు" లేదా "పిండం వైత్త నల్లూరు" అని పిలిచేవారు. చెంగల్పట్...