Tiruvannamalai a unique place

           అసాధారణ విశేషాల నిలయం  - తిరువణ్ణామలై 



తిరువణ్ణామలై లో అణువణువూ శివ స్వరూపమే!
కైలాసనాధుడే కొండ రూపంలో కొలువైన దివ్య క్షేత్రం కదా !
ఈ కారణం గానే మరే  పుణ్య క్షేత్రం లోనూ లేని కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. 









ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా ఎంతో ప్రాముఖ్యం గల పౌరాణిక నేపధ్యం కలిగి ఉంటాయి. ఇక్కడ తప్ప మరెక్కడ పర్వతాన్ని పరమేశ్వరుని క్రింద పూజించరు. 


శ్రీ కుమార స్వామి ఉద్భవించిన స్థంభం 




శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ప్రియ భక్తుడైన అరుణగిరినాథర్ గానానికి పరవశుడై ప్రత్యక్షమైన క్షేత్రం ఇదొక్కటే !
ప్రాంగణంలో మొదటగా వచ్చే మురుగన్ ఆలయం లోని స్థంభం నుండే స్వామి ఉద్భవించినట్లుగా చెబుతారు.







గిరివలయంలో దర్శించుకొని అష్ట దిక్పాల లింగాలు మరియు సూర్య చంద్ర ప్రతిష్ఠిత లింగాలు ఇక్కడే ఒక వరుసలో కనపడతాయి. చాలా చోట్ల దిక్పాలకులు , గ్రహాలూ ప్రతిష్టించి లింగాలు ఉన్నా ఇలా మాత్రం ఉండవు.
ముగ్గురు మహర్షుల ( దుర్వాస, గౌతమ మరియు అగస్త్య) ఆరాధనా స్ధలాలు ఒక్క తిరువణ్ణామలై లోనే ఉంటాయి.


స్వామి వారి శయన మందిరం 



సంవత్సరానికి నాలుగు బ్రహ్మోత్సవాలు జరిగే అరుదైన పుణ్య క్షేత్రాలలో అరుణాచలం ఒకటి.
ప్రాంగణంలో ఉన్న విమాన మరియు గోపురాలు ఒక్క ప్రదేశంలో నిలబడి చూడగలిగే అద్భుత నిర్మాణ చతురత కనపడుతుంది ఈ ఆలయంలో ! చక్కని  శిల్ప కళ విస్మయ పరుస్తుంది.







నిజ భక్తుని భక్తికి పరవశుడైన భక్తవత్సలుడు అతని పుత్రునిగా మారి సామాన్య మానవునిలా సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం పెట్టడం అరుణాచలేశ్వరం లోనే !
విడివిడిగా కొలువుతీరిన ఆదిదంపతులు ఉమ్మడిగా శయన మందిరం ఉన్న క్షేత్రం ఇదే !
ప్రతి రాత్రీ తొమ్మిదిన్నరకి జరిగే పవళింపు సేవ చూడ చక్కని సేవ !






ఉత్తర ద్వారం 



వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రుక్మిణీ సత్య భామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం లభించే శైవ క్షేత్రం తిరువణ్ణామలై ! అదీ ప్రధాన ఆలయం లోనే!
అనేక మంది ఆధ్యాత్మిక మార్గదర్శకుల పుట్టినిల్లు తిరువణ్ణామలై !







శ్రీ వైష్ణవులకు ఎంతో పవిత్రమైన "తిరుప్పావై" లాగా శైవులకు పరమ పవిత్రమైన "తిరు వెంబావై"ని మాణిక్యవాసగర్ రచించినది తిరువణ్ణామలై లోనే! ఈ కీర్తనలను మార్గశిర మాసంలో తమిళనాడులోని అన్ని శివాలయాలలో నియమంగా గానం చేస్తారు.
తమిళ భాషలో విలువైనవిగా భావించే ఎన్నో అద్భుత రచనలు ఉద్భవించిన సరస్వతీ క్షేత్రం తిరువణ్ణామలై!




దర్శిస్తేనో, పూజిస్తేనో, ఆరాధిస్తేనో మనోభీష్టాలు నెరవేర్చే క్షేత్రాలు అనేకం ఉన్నాయి. కానీ స్మరణ మాత్రమే సకల పాపాలను హరించి ఇహ పర సుఖాలను అనుగ్రహించే ఒకే ఒక్క నామం "అరుణాచలం"
అందుకే అరుణాచలేశ్వరునికి ఆరోం హర !!!! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore