Sri Kanaka Durga Devi Temple, Vijayawada

శ్రీ కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రీ, విజయవాడ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని సమస్త భక్తలోకం ఎలుగెత్తి కీర్తించే తల్లి ఇంద్రకీలాద్రి మీద కొలువైన శ్రీ కనక దుర్గమ్మ ! యుగాల క్రిందట భక్తుని కోరిక మేరకు, శిష్టరక్షణార్ధం, దుష్ట శిక్షణార్ధం దుర్గమ్మ వెలసిన విజయవాడ, పక్కన గలగలా పారే కృష్ణమ్మ ఎన్నో పురాణ గాధలను తెలుపుతాయి. కీలుడనే పర్వత రాజు అమ్మవారి భక్తుడు. జగన్మాత తన హృదయ కుహరంలో కొలువు తీరాలన్నఏకైక కోరికతో తపస్సు చేసాడు. సంతుష్టురాలైన జగదాంబ సాక్షాత్కారం ప్రసాదించి తొందరలోనే కలియుగాంతం వరకు ఇక్కడ నివాసముంటానని వరము అనుగ్రహించింది. అనంతర కాలంలో లోకకంటకుడైన దుర్గమాసురుని సంహరించిన దేవి ఈ పర్వతం మీద స్వయంవ్యక్తగా ప్రకటితమయ్యారు. అసురుని భాధ తొలగిన ఆనందంతో ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి పవిత్ర కృష్ణవేణిలో స్నానమాచరించి దుర్గంబను సేవించుకొన్నారు. ఈ కారణంగాపర్వతకుని పేరు ప్రధమ పూజ చేసిన ఇంద్రుని పేరు కలిసి ఈ శిఖరం "ఇంద్ర కీలాద్రి "గా జగత్...