పోస్ట్‌లు

జులై, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Durgai Amman Temple, Tiruvannamalai

చిత్రం
                 శ్రీ దుర్గా దేవి ఆలయం, తిరువణ్ణామలై     కొండ రూపంలో కపర్ది కొలువు తీరిన అపూర్వ కైలాస సమాన క్షేత్రం తిరువణ్ణామలై.  అడుగడుగున ఆలయమున్నమహనీయ క్షేత్రం తిరువణ్ణామలై. ప్రతి చిన్న పెద్ద ఆలయం సందర్శనీయం. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పురాతనమైన శ్రీ దుర్గా దేవి ఆలయం. ఈ ఆలయ పురాణ గాధ మహిషాసుర సంహారంతో ముడిపడి ఉండటం విశేషం.   సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడినదిగా  పేర్కొనే ఈ ఆలయ పౌరాణిక గాధ  ఇలా ఉన్నది.  ఆలయ గాధ  ఒకసారి ఆది దంపతులు కైలాసంలో చతురోక్తులతో సమయం గడుపుతున్నారు . వినోదంగా పార్వతీ దేవి త్రినేత్రుని నేత్రాలను తన హస్తాలతో మూసివేశారు . లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులా నేత్రాలు . లోకమాత క్షణకాలం కనులను మూయడం వలన లోకాలన్నీ వేల సంవత్సరాలు అంధకారంలో మునిగిపోయాయి . లోకాలలో   పరిస్థితులన్నీఅల్లకల్లోలంగా మారిపోయాయి . అమ్మవారికి తాను చేసిన తప్పు అవగతమైనది . లోకాలను కాపాడే ఆదిశక్తి వాటిని అస్తవ్యస్తంగా మార్చినందుకు ఆమ...