Ernakulatappan Temple, Ernakulam

       ఎర్నాకులతప్పన్ ఆలయం, ఎర్నాకుళం 





కేరళ రాష్ట్రం ఎన్నో అరుదయిన ఆలయాలకు నిలయం.
ఈ \పరశురామ భూమిలోని పెక్కు ఆలయాలు రామాయణ,భారత మరియు భాగవత గాధలతో ముడిపడి ఉండటం గమనించ దగిన అంశం.అలాంటి వాటిల్లో ఎర్నాకుళం పట్టణ రక్షకులైన శ్రీ ఏర్నాకులతప్పన్ ఆలయం  ఒకటి.
ఈ ఆలయ పురాణ గాధ ద్వాపర యుగానికి చెందినది.







మహా భారత విజేతలైన పాండునందనులలో మధ్యముడైన అర్జనుడు పార్వతీ నాధుని మెప్పించి పాశుపతాస్త్రం పొందినది ఇక్కడే అంటారు.
మాయా జూదంలో ఓడిన తరువాత చేస్తున్న పన్నెండేళ్ళ వనవాస సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలని నిర్ణయించుకొన్నాడు ఫల్గుణుడు.
అన్నింటిలోనికీ శక్తివంతమైన "పాశుపతాస్త్రం" పొందాలన్న ఆలోచనతో బయలుదేరాడు
అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని ఒక లింగాన్ని ప్రతిష్టించుకొని, నిత్యం పూజిస్తూ త్రీవ్రమైన తపస్సు చేయసాగాడు.
అతని తపస్సుకు సంతుష్టుడైన సదాశివుడు అతని శౌర్య ప్రతాపాలను పరీక్షింపనెంచారు.
ఒకనాడు శివపూజ తరువాత తపస్సుకు ఉపక్రమించబోతున్న అర్జనుని వైపుకు భయంకరంగా ఆరుస్తూ అడవి పంది పరుగు పరుగున రాసాగింది.
వెంటనే విల్లు ఎక్కుపెట్టి  బాణం సంధించి వదిలాడు గాండీవి.
అదే సమయంలో రెండో పక్కనుండి మరో బాణం వచ్చి తగిలింది.
నేలకూలిన సూకుర శరీరంలో రెండు అమ్ములున్నాయి.
మరొకరు ఎవరా అని చూస్తుండగా "ఈ వేట నాది !" అంటూ పరివారంతో ప్రవేశించాడోక కోయదొర.
"కావాలంటే చచ్చిన పందిని తీసుకో! కానీ అది చచ్చినది నా బాణంతో ! అది నీ వేట ఎలా అవుతుంది ?" అని
ప్రశ్నించాడు అర్జనుడు


































































.












నాగ ఋషి గా పిలవబడే దేవలుడు శాప విముక్తి కొరకు అన్వేషణ చేస్తూ ఇక్కడి చేరుకొన్నాడు.
అమిత భక్తి శ్రద్దలతో ఇక్కడి శివలింగాన్ని కొలిచి అనతి కాలంలోనే మనిషి రూపం పొందాడు.
ఇంతటి ప్రాశస్థ్యం కలిగిన ఈ క్షేత్రం గురించి క్రీస్తు పూర్వం మూడువందల సంవత్సరాల నుండి క్రీస్తుశకం మూడువందల సంవత్సరాల మధ్య కాలానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో పే ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు ప్రతిష్టించిన లింగం తదనంతర కాలంలో అనేక మంది రాజ వంశాల అధ్వర్యంలో అనేక మార్పులూ చేర్పులూ జరిగి నేటి రూపాన్ని సంతరించుకొన్నది.




































ప్రస్తుత ఆలయాన్ని కొచ్చిన్ రాజుల దీవాన్ అయిన "శంకర్ వారియర్" 1842లో పునః నిర్మించారు.
పూర్తిగా కేరళ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయానికి పడమర లో అరేబియా సముద్రం ఉంటుంది.
గర్భాలయం పడమర ముఖంగా ఉంటుంది.
వర్తులాకార గర్భాలయంలో అడుగున్నర ఎత్తు  వెడల్పుతో ఉన్న లింగాకారంలో శ్రీ గౌరీ శంకర స్వామి దర్శనమిస్తారు.














పడమర  దిక్కున అరేబియా సముద్ర తీరానికి దారి తీసే ఈ మార్గాన్ని "దేవి ద్వారం" అంటారు.


















భక్తులు ప్రేమగా "ఎర్నాకులతప్పన్ " అని పిలుచుకొంటారు.
ఈ పేరు రావడానికి  గల కారణం ఇక్కడి పుష్కరణి.
ఎప్పుడూ నీటితో నిండి వుండే కొలను అని అర్ధం వచ్చేలా "ఏరు నాల్ కులం" అని పిలిచేవారట.
అదే కాలక్రమంలో "ఎర్నాకుళం"గా మారింది.
స్వామికి ఉదయం ఏడుగంటలకు జరిగే సహస్ర కలశాభిషేకం వీక్షించదగినది
ఆ తరువాత  చందన, పుష్ప, స్వర్ణ రజత ఆభరణాలతో  జరిగే అలంకరణలో శ్రీ గౌరీ శంకర స్వామి నేత్ర పర్వంగా దర్శనమిస్తారు.
గర్భాలయానికి దక్షిణాన వేటకారాన్, ఉత్తరాన శ్రీ గణేశుడు ఉపాలయాలొ ఉపస్తితులై ఉంటారు





















అమ్మవారికి ప్రత్యేక సన్నిధి లేదు.
గర్భాలయం వెనుక ఉన్న అమ్మవారి రూపానికే మహిళలు కుంకుమార్చన, పుష్పార్చన చేసుకొంటారు.
ప్రాంగణంలో శ్రీ ధర్మ శాస్తా మరియు శ్రీ నాగరాజ సన్నిధులు ఉన్నాయి.
ప్రతి నిత్యం నియమంగా అయిదు పూజలు జరుపుతారు.
ఉదయము మూడున్నర నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయానికి పక్కనే 1800వ సంవత్సరంలో తమిళ బ్రాహ్మణులూ శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని  నిర్మించారు.
పూర్తిగా తమిళ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయంలో శ్రీ వినాయక ఉఆపలమ్, నవగ్రహ మండపం తో పాటు గర్భాల వెలుపలి గోడలలో శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు, శ్రీ దుర్గ, శ్రీ గణపతి ఉపస్థితులై ఉంటారు.


















ఈ  ఆలయాల వద్దనే కళ్యాణ మండపం, సమావేశ మందిరం కూడా నిర్మించారు. 










గర్భాలయంలో వల్లీ దేవసేన సమేతులై శ్రీ కుమార స్వామి స్థానక భంగిమలో దర్శనమిస్తారు.
ఈ ఆలయానికి ఎదురుగా 1850వ సంవత్సరంలో ఉడిపి మధ్వ బ్రాహ్మణులూ నిర్మించిన శ్రీ ఆంజనేయ ఆలయం, శ్రీ రాఘవేంద్ర బృందావనం ఉంటాయి. త్రివేణి సంగమం మాదిరి మూడు ఆలయాలు ఉన్న ఈ క్షేత్ర ప్రతి నిత్యం వదలాది స్థానిక, దూర ప్రాంత భక్తులతో కళకళలాడుతుంటుంది.
సోమ, మంగళ, భూద, గురు వారాలలో మరియు మాస శివరాత్రి, షష్టి తిధులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అన్ని హిందూ పర్వ దినాలలో విశేష పూజలు, అలంకరణలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ పురాతన ఆలయాలు ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ కు అర కిలో మీటర్ దూరంలో ఉంటాయి













శ్రీ హనుమంతునికి ప్రీతి కరమైన తమల పాకులు, పుష్పాలు ప్రతి నిత్యం విక్రయిస్తుంటారు.








ఇక్కడ కనిపించే వట వృక్షం వయస్సు రెండు శతాబ్దాల పైమాటే .







ఓం నమః శివా!య !!!





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore