పోస్ట్‌లు

ఏప్రిల్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Kurnool Temples

చిత్రం
 తొలితరం శిరిడి సాయి బాబా ఆలయాలలో ఒకటి కర్నూల్ నగరంలో తుంగభద్రా నదీ తీరంలో, చరిత్ర ప్రసిధికెక్కిన కొండా రెడ్డి బురుజుకి సమీపంలో ఉన్నది. సాయిబాబా మందిరాలంటారు .  కానీ దీనిని ఆలయం అనే పిలవాలి.  ఎందుకంటె ఉత్తర భారత శైలిలో కాకుండా పూర్తిగా దక్షిణ భారత పద్దతిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని తొలితరం నాటిది అని ఎందుకన్నానంటే ఆంధ్ర రాష్ట్రంలో సాయిబాబా అంతగా విస్త్రుత ప్రచారంలోనికి రాని కాలంలో కట్టారు కనుక.  శ్రీ .  వీరస్వామి అనే భక్తులు 1949-1951 మధ్య కాలంలో నిర్మించారీ ఆలయాన్ని.  గురుస్తానం, ధుని, ప్రదక్షిణ ప్రాంగణము, నంద దీపము, సాయి ధ్యాన మందిరము, శ్రీ దతాత్రేయ స్వామి,  నవ అవధూతల మండపము, శ్రీ సాయి భూలోకంలో నడయాడిన సమయంలో జరిగిన ముఖ్య ఘట్టాల చిత్రాలు ఇక్కడ చూడవచ్చును. అన్ని పర్వ దినాలలో వైభవంగా ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. నిత్యం నియమంగా నాలుగు హారతులు జరుపుతారు . కర్నూల్ పట్టణంలో తప్పక దర్శించవలసిన వాటిల్లో శ్రీ సాయి బాబా ఆలయం ఒకటి. 

Budagavi

చిత్రం
బూదగవి అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలంలో ఉన్నది. చుట్టూ పర్వతాలతో, పంటపొలాలతో అచ్చమైన రాయలసీమ గ్రామీణ వాతావరణానికి నిదర్సనమైన బుదగవి గ్రామంలో చారిత్రక ప్రసిద్దిచెందిన రెండు పురాతన ఆలయాలున్నాయి. ఒకటి అరుదైన సూర్య భగవానుని ఆలయం కాగా రెండవది శ్రీ రామ భక్త శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిది. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న వీటిని కర్నాటకాన్ని పాలించిన చాళుక్య రాజులు పదమూడవ శతాబ్దంలో  నిర్మించినట్ట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. సూర్య నారాయణునికి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అయిదు శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయాలలో ఇది మూడవది. మొదటిది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, రెండవది కర్నూల్ జిల్లా నందికోట్కూర్ లో ఉన్నాయి. నాలుగవది తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో, ఐదవది హైదరాబాదులో ఉన్నాయి.  నిరాదరణకు గురై శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాన్ని విదేశాలలో స్థిరపడిన ఈ గ్రామస్తులు కొందరు పునర్నిర్మించారు.  చాళుక్య రాజులు ఇక్కడ శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం నిర్మించడానికి కారణమైన పురాణ గాధ ఏది తెలియరావడం లేదు. కాని ఆలయం ఎన్నో ప్రత్య...

Attirala

చిత్రం
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్నో అరుదయిన ఆలయాలకు నిలయం. యుగాల క్రిందట రచించిన పురాణాలలో ఉదహరించబడి, వందల సంవత్సరాల చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు ఈ ఆలయాలు.  అలాంటి వాటిల్లో ఎన్నతగినది అత్తిరాల.  అత్తిరాల అంటే , మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం.  సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం.  లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి.  కలియుగంలో శివ కేశవుల ఉమ్మడి నిలయం.  ఆధునిక యుగంలో గత చరిత్రను భావి తరాలకు సవివరంగా తెలియ చెప్పడానికి పరిరక్షిస్తున్న కట్టడాల కేంద్రం. పురాణ గాధ :  సత్య యుగంలో లో శ్రీమన్నారాయణుని ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు, ఇరవై ఒక్క మార్లు భూమండలంలో జరిపిన రక్త పాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ, క్షేత్ర దర్శనం చేస్తూ ఇక్కడికి వచ్చారు. బహుదా నదిలో స్నానమచారించాగానే పరుశువు రాలి క్రింద పడిపోయింది.  అలా పరశురామునికి ...