శ్రీ మహా విష్ణు లోక కళ్యాణం కోసం ధరించిన అనేక అవతారాలలో ముఖ్యమైన దశావతారాలలో భూమిమీద పెరిగిపోతున్న పాపభారాన్ని తగ్గించడానికి చేపట్టినది శ్రీ పరశురామ అవతారం. ఆరవ అవతారమైన దీనిలో దుష్టులైన రాజులను సంహరించి జనులకు స్వచమైన, చక్కని పాలన అందించిన దలచిన పెరుమాళ్ళు తను జయించన భూ భాగాన్ని అర్హులైన వారికీ దానమిచ్చి తను తపమచారించడానికి సముద్రుని నుండి తీసుకున్నదే నేటి కేరళ మరియు కొకన్ ప్రాంతం .( మంగలూరు మరియు గోవా ).
దేవతలా స్వస్థలం గా పేరొందిన కేరళ సృష్టి కర్త శ్రీ పరశురామునికి ఉన్న ఒకే ఒక్క ఆలయం తిరువనంతపురం రైల్వే స్టేషన్ కి సుమారు ౬ కిలోమీటర్ల దూరంలోకోవలం బై పాస్ రోడ్ లో కిల్లి మరియు కరవన నదుల సంగమ క్షేత్రం లో ఉన్న తిరువళ్ళం లో ఉన్నది.
పురాణ కాలంలో మహర్షి శ్రీ బిల్వ మంగళ స్వామి కి శ్రీ హరి అనంత శాయనునిగా దర్సనమిచ్చిన సమయంలో పాదాలు పడిన స్తలం ( నేటి టెక్ నో పార్క్ ) తిరుప్పదాపురం ఐతే శరీర భాగం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కాగా తల ఉండిన ప్రదేశమే తిరువళ్ళం.
ఇది త్రిమూర్తి క్షేత్రం
సృష్టి స్థితి లయాకారులు ముగ్గురు ఒకే చోట కొలువైన పవిత్ర స్తలం ఇదే.
గతించిన ప్రియతములకు సద్గతులు కలిగించే క్రతువులు నిర్వహించే పుణ్య తీర్ధ స్థలి తిరువళ్ళం.
ఎన్నో పండుగలు , ఉస్తవాలు ఎక్కడ జరుగుతాయి.
 |
ఆలయ ప్రధాన ద్వారం |
 |
శ్రీ గోపాల కృష్ణ |
 |
లార్డ్ పరశురామ మరియు విధాత ఆలయాలు |
 |
శివాలయం |
 |
పరశురామ గర్భాలయం |
 |
శ్రీ పరశురామ |
 |
శ్రీ గణపతి ఆలయం |
 |
శ్రాద్ధ కర్మల మండపం |
 |
మూలవిరాట్ |
 |
స్వాగత ద్వారం |
ఎన్నో ప్రత్యేకతలకు నిలయం ఈ ఆలయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి