Chenganassery Temples

చెంగానసెర్రి కొట్టాయం జిల్లలో ఉన్నది. సుమారు ఒకటో శతాబ్ది నుండి వెలుగులో ఉన్న ఈ ఊరు తన పేరులోనే కాదు ఇక్కడి సర్వమత సహా జీవనం లో కూడా ఎంతో ప్రసిద్దిపొండినదిగా చరిత్రలో చిరస్థాయిగా  నిలిచినది.
క్రీస్తు శకం ఒకటో శతాబ్ది లో మొదటి సరిగా భారత భూ భాగంలోనికి క్రైస్తవులు కాలు పెట్టిన పడమటి తీరంలోని ప్రాంతాలలో ఇది కూడా ఒకటి చెబుతారు,
బ్యాక్ వాటర్ కి కూడా పేరుగాంచిన ఈ ప్రాంతం అనాదిగా వ్యాపారానికి పేరుపొందినది. ఈ పేరు రావడానికి అప్పట్లో ఉపయోగించిన మన గిద్ద, సేరు, మానిక లాంటి వాటికీ  మలయాళ పర్యాయ పదాలైన చెంగాలి, నలి, ఉలి   అనే మూడు పదాలే కారణమని అంటారు.
ఇదే కాకుండా పేరు వెనుక మరో కధనం కూడా వినిపిస్తుంది.
రాజ మార్తాండ వర్మ కు సామంత రాజు ఒకరు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ ఉదయం నిద్ర లేవగానే ఆలయంలోని శంకు నాదం, చర్చిలోని గంటల శబ్దం , మజీద్ లోని నమాజు వినాలన్న ఆకాంక్ష్నతో మూడింటిని సుమారు వేయి సంవస్సరాల క్రిందట మహాదేవ ఆలయం, చర్చి, మజీద్ లను నిర్మించడంవలన ఆ మూడు పదాల ( సంకు, చర్చి గంటల నాదం , మరియు నమాజు పిలుపు "చెర్రి" ) మూలంగా చెంగానచేర్రి అన్న పేరు వచ్చింది అంటారు.
నేటికి నాడు నిర్మించిన గుడి, చేర్చి, మజీద్ లు నిలిచి ఉండి దీపోస్సవం, చందనక్కోడి లాంటి వివిధ మతాల పండుగలను కలిసి మెలిసి చేసుకొంటూ మూడు మతాల త్రివేణి  సంగమం గా  పేరొందినది.
చెంగానచేర్రి లో అతి పురాతన కావాల్ భగవతి మరియు శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయాలున్నాయి.
బ్యాక్ వాటర్ లో పడవ షికారు , దగ్గరలో గల సముద్ర తీరం లో ఆటలు, సమీపంలో ఉన్న కొండ ప్రాంతాలలో విహారం చాల బాగుంటాయి.
చెంగానచేర్రి రైల్వే స్టేషన్ లో అన్ని ముఖ్య రైళ్ళు ఆగుతాయి.


ప్రక్రుతి రంగులతో వేసిన చిత్రాలు 

శ్రీ సుబ్రమణ్య ఆలయం 

ఆలయ గజ రాజు 

నాగ దేవతలు 

ఆలయంలో నాగరాజు 

శ్రీ కృష్ణ ఆలయం 


సుబ్రమణ్య ఆలయ ప్రవేశ ద్వారము 

ఆలయ పుష్కరణి

ఆలయ మహా ద్వారము 

మజీద్ 

కావలి భగవతి 

రాతి సిలువ 

చెర్చ్

మహాదేవ మందిర్ 

ధ్వజస్తంభం 

సజీవ నందీశ్వరుడు (౨౫ సం. రాల ఎద్దు )
కొచిన్ లేదా తిరువనంతపురం నుండి రోడ్ మార్గంలో ఇక్కడికి సులబంగా చేరుకోవచ్చు. హోటల్  ఇతర సదుపాయాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. చుట్టుపక్కల చాలా పేరున్న ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram