పోస్ట్‌లు

డిసెంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

Tiruvallam sri parasurama temple.

చిత్రం
శ్రీ మహా విష్ణు లోక కళ్యాణం కోసం ధరించిన అనేక అవతారాలలో ముఖ్యమైన దశావతారాలలో భూమిమీద పెరిగిపోతున్న పాపభారాన్ని తగ్గించడానికి చేపట్టినది శ్రీ పరశురామ అవతారం. ఆరవ అవతారమైన దీనిలో దుష్టులైన  రాజులను సంహరించి జనులకు స్వచమైన, చక్కని పాలన అందించిన దలచిన  పెరుమాళ్ళు తను జయించన భూ భాగాన్ని అర్హులైన వారికీ దానమిచ్చి తను తపమచారించడానికి సముద్రుని నుండి తీసుకున్నదే నేటి కేరళ మరియు కొకన్ ప్రాంతం .( మంగలూరు మరియు గోవా ). దేవతలా స్వస్థలం గా పేరొందిన  కేరళ సృష్టి కర్త శ్రీ పరశురామునికి ఉన్న ఒకే ఒక్క ఆలయం తిరువనంతపురం రైల్వే  స్టేషన్ కి సుమారు ౬ కిలోమీటర్ల దూరంలోకోవలం బై పాస్ రోడ్ లో కిల్లి మరియు కరవన నదుల సంగమ క్షేత్రం లో ఉన్న తిరువళ్ళం లో ఉన్నది. పురాణ కాలంలో మహర్షి శ్రీ బిల్వ మంగళ స్వామి  కి శ్రీ హరి అనంత శాయనునిగా దర్సనమిచ్చిన సమయంలో పాదాలు పడిన స్తలం  ( నేటి టెక్ నో  పార్క్ )  తిరుప్పదాపురం ఐతే శరీర భాగం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కాగా తల ఉండిన ప్రదేశమే తిరువళ్ళం. ఇది త్రిమూర్తి క్షేత్రం సృష్టి స్థితి లయాకారులు ముగ్గురు ఒకే చోట కొలువైన...

Chenganassery Temples

చిత్రం
చెంగానసెర్రి కొట్టాయం జిల్లలో ఉన్నది. సుమారు ఒకటో శతాబ్ది నుండి వెలుగులో ఉన్న ఈ ఊరు తన పేరులోనే కాదు ఇక్కడి సర్వమత సహా జీవనం లో కూడా ఎంతో ప్రసిద్దిపొండినదిగా చరిత్రలో చిరస్థాయిగా  నిలిచినది. క్రీస్తు శకం ఒకటో శతాబ్ది లో మొదటి సరిగా భారత భూ భాగంలోనికి క్రైస్తవులు కాలు పెట్టిన పడమటి తీరంలోని ప్రాంతాలలో ఇది కూడా ఒకటి చెబుతారు, బ్యాక్ వాటర్ కి కూడా పేరుగాంచిన ఈ ప్రాంతం అనాదిగా వ్యాపారానికి పేరుపొందినది. ఈ పేరు రావడానికి అప్పట్లో ఉపయోగించిన మన గిద్ద, సేరు, మానిక లాంటి వాటికీ  మలయాళ పర్యాయ పదాలైన చెంగాలి, నలి, ఉలి   అనే మూడు పదాలే కారణమని అంటారు. ఇదే కాకుండా పేరు వెనుక మరో కధనం కూడా వినిపిస్తుంది. రాజ మార్తాండ వర్మ కు సామంత రాజు ఒకరు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ ఉదయం నిద్ర లేవగానే ఆలయంలోని శంకు నాదం, చర్చిలోని గంటల శబ్దం , మజీద్ లోని నమాజు వినాలన్న ఆకాంక్ష్నతో మూడింటిని సుమారు వేయి సంవస్సరాల క్రిందట మహాదేవ ఆలయం, చర్చి, మజీద్ లను నిర్మించడంవలన ఆ మూడు పదాల ( సంకు, చర్చి గంటల నాదం , మరియు నమాజు పిలుపు "చెర్రి" ) మూలంగా చెంగానచేర్రి అన్న పేరు వచ్చింది అ...

Sri Kasinayana Temple, Jyothi, AP

చిత్రం
                              శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి   జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం  లో ఉన్నది. వయా ఓబులాపురం మీదగా బస్సులు గిద్దలూరు నుండి ఉన్నాయి. ఇక్కడే ఆలయాలలో  ఉచితన్నదాన కార్యక్రమ  ప్రారంభ స్ఫూర్తి  ప్రదాత అవధూత శ్రీ కాశి నాయన సమాధి చెందారు. కామధేను గోవు సమాధి, శివ, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇతర ఆలయాలు ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం కాశి నాయన సమాధి మీద ఎందరో అవధుతలు, మహా పురుషుల, యోగుల, మహారుషుల ,దేవతల శిల్పాల తో కూడిన ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతి లో మసుకు ప్రశాంతి ని ప్రసాదించే పరిసరాల తో  ఆహ్లాదకరంగా ఉండే జ్యోతి లో ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. అన్ని జీవులకు అన్నదానం  కాశి నాయన సమాధి మందిరం  శ్రీ కాశి నాయన  శ్రీ కాశి నాయన పంచ లోహ మూర్తి  నాయన పాదుకలు  నిర్మాణం లో ఉన్న ఆలయం / శిల్పాలు  నవగ్రహ మండపం  ...