Sri Shobhanachala Vyaghra Narasimha Swami Temple, Agiripalli

శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి ఆలయం లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి మొత్తంగా ఇరవై నాలుగు అవతారాలు వివిధ సందర్భాలలో తీసుకొన్నారని తెలుస్తోంది. కానీ మనందరికీ తెలిసినవి దశావతారాలు మాత్రమే. మిగిలిన వాటిలో కొన్ని పేర్లు తెలిసినా వారు శ్రీమన్నారాయణుని అంశ అని తెలియదు. దశావతారాలలో అత్యంత భీకరమైనది ఉగ్రమైనది శ్రీ నృసింహ అవతారం. అహోబిలం లో ఉగ్రస్థంభం నుండి అవతరించిన స్వామి అసురుడైన హిరణ్యకశ్యపుని సంహరించారని పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షససంహారం అనంతరం ఆవేశం తగ్గని నృసింహుడు మన తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో తిరుగుతూ వివిధ కారణాల వలన ముప్పై రెండు క్షేత్రాలలో కొలువైనారని చెబుతారు. భక్త ప్రహ్లాద స్తోత్ర పాఠాలతో చివరికి శాంతించిన నరసింహుడు విశాఖపట్నం కు సమీపంలోని భీమునిపట్నం (భీమిలి) లో ఉన్న సౌమ్య గిరి పైన\శ్రీ సౌమ్య నారాయణ నరసింహుడుగా వెలిశారని చెబుతారు. స్వామివారు ఇక్కడ చతుర్భుజాలతో మానవ రూపంలో దర్శనమిస్తారు. సౌమ్య గిరిని స్థానికంగా పావురాల కొండ అని పిలుస్తా...