పోస్ట్‌లు

డిసెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Srikakuleshwara swami Temple, Srikakulam (Krishna District)

చిత్రం
                               నేను తెలుగు వల్లభుండ ! భారతదేశ నలుచెరగులా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. కానీ ఏ ఒక్క ఆలయంలో కొలువైన స్వామిని కూడా ఆ ప్రాంత నామం కలిపి పిలవరు. ఆ గొప్పదనం ఒక్క ఆంధ్రదేశానికే దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు.  అలా వైకుంఠ వాసుడు  "శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు"గా పూజలు అందుకొంటున్న దివ్యధామం శ్రీకాకుళం. పావన కృష్ణాతీరంలో కలదు. స్వామిని ఆంధ్ర నాయకుడు, తెలుగు వల్లభుడు, ఆంధ్ర మహావిష్ణువు అని పిలుస్తారు.  శ్రీకాకుళం అనేక పౌరాణిక మరియు చారిత్రక సంఘటనలకు కేంద్ర బిందువని అనేక పురాతన గ్రంధాల మరియు చరిత్రకారుల రచనల ఆధారంగా తెలుస్తోంది.  క్షేత్ర  చరిత్ర బ్రహ్మాండ మరియు స్కాంద పురాణంలో శ్రీకాకుళ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర కౌముది అనే పురాతన గ్రంధంలో నాటి పాలకుల వివరాలు పేర్కొన్నట్లుగా చెబుతారు.  క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటికి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన వారి తొలి రాజధాని శ్రీకాకుళం  అన్నది దేశవిదేశీ చరిత్రకారుల మాటగా ఉన్నది. శాతవాహనుల తొలి పా...