Dabaleshwar Mahadev Mandir, Titlagarh

శ్రీ ధవళేశ్వర్ మహాదేవ్ మందిర్, టిట్లాగర్హ్ లయకారుడైన నిరాకారునికి పుడమిలో ఉన్న ఆలయాలకు లెక్కలేదు. అందులోనూ ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతను చాటుకొంటాయి. అవడానికి లింగాకారుడైనా ఆ లింగాలు కూడా భిన్న రూపాలలో ఉండి వివిధ నామాలతో పిలవబడటం విశేషం. ఈ లింగాలలో చాలా వరకు స్వయం భూలు కావడం మరో ప్రస్తావించవలసిన అంశం. ఈ లింగాలు ఎక్కువగా దట్టమైన అడవులలో, పర్వత ప్రాంతాలలో, సాగర సంగమ ప్రదేశాలలో మరియు పవిత్ర నదీ తీరాలలో ఉన్నాయి. కానీ శక్తి ఆరాధన అధికంగా ఉండే ఒడిశా రాష్ట్రంలో అనేక లింగాలు కొండ గుహలలో ఉంటాయి. అన్నీ కూడా ఎత్తుగా, పెద్ద కైవారంతో కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు కోరాపుట్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ గుహాలయాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా మల్కనగిరి, బాలేశ్వర్, సంబల్పూర్ మరియు బోలంగిర్ జిల్లాలలో కనిపిస్తాయి. వీటి వెనుక చెప్పుకోదగిన పౌరాణిక లేదా చారిత్రక విశేషం ఉన్నది. అలాంటి ఒక విశేష ఆలయం గత నెలలో సందర్శించుకునే అవకాశం వచ్చింది.ఆ విశేషాలు అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో...