Pakshi Theerdham

శ్రీ వేదగిరీశ్వర స్వామి ఆలయం- పక్షి తీర్థం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక క్షేత్రం పవిత్రమైనదిగా ప్రఖ్యాతి చెందడానికి అక్కడి పురాణ గాధ, కొలువైన దేవదేవుడు, దైవానుగ్రహం పొందిన భక్తులు, ఆలయ నిర్మాణ విశేషాలు మొదలగున్నవి ప్రధాన కారణాలవుతాయి. కానీ చిత్రంగా కైలాసనాధుడు శ్రీ వేదగిరీశ్వరునిగా పూజలందుకొంటున్న ఈ క్షేత్రం పైన పేర్కొన్నవి అన్ని ఉన్నా కూడా "పక్షి తీర్ధం" గా పేరు పొందినది. మనలో చాలా మందికి ఈ క్షేత్రం గురించి తెలుసు. కొందరు స్వయంగా పక్షులు అర్చక స్వామి చేతుల మీదగా ప్రసాదం స్వీకరించడం చూసిన వారు కూడా ఉండే ఉంటారు. కానీ ఆ రెండు పక్షులకు, ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం తెలిసి ఉండక పోవచ్చును. తమిళనాడులోని అనేక విశేష శైవ క్షేత్రాలలో అగ్రస్థానంలో ఉన్నవాటిలో పక్షి తీర్థం ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఈ క్షేత్రంతో ఎన్నో గాథలు ముడిపడి ఉన్నాయి. పక్షి తీర్థం అందుబాటులో లభిస్తున్న కథనాల ఆధారంగా ఈ పక్షులు గత జన్మలో మానవులుగా పుట్టి మహర్షులుగా మారి చేసిన దైవ ధిక్కారానికి ప్రతిగా పొందిన శ...