నమః శివాయ
లోకాలను ఏలే త్రిమూర్తులలో బ్రహ్మ దేవునికి వివిధ కారణాల వలన అతి తక్కువ ఆలయాలున్నాయి. వైకుంఠ వాసుడు లోక క్షేమం కొరకు ధరించిన అవతార స్వరూపాలతో కలిసి అనేక పుణ్య క్షేత్రాలలో కొలువు తీరి ఉన్నారు.
భువిలో అత్యధిక ప్రదేశాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నది కైలాసవాసుడే !ఆయన పరివారంలో భాగం అయిన గణపతి, కుమార స్వామి, పార్వతీ దేవి, వీరభద్రుడు, భైరవుడు ఆదిగా గల వారితో కలుపుకొంటే వేలాది క్షేత్రాలలో వీరంతా కొలువు తీరి భక్తులను కరుణిస్తున్నారు.
ఇవి కాకుండా ఒక విషయం ఆధారంగా అంటే కొలుసు కట్టు ఆలయాలు అధికంగా ఉన్నది కూడా మహేశ్వరునికే ! వీటిల్లో కొన్ని మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం ఆలయాల రాష్ట్రం తమిళనాడులోనే !
ఇవన్నీ కూడా ఆర్తులకు ఆదిదేవుని అనుగ్రహం లభించడానికి ఏర్పాటు చేసినవి. ప్రజలు ప్రతి నిత్యం భగవంతుని ఆరాధిస్తుంటారు. కానీ అన్యధా శరణం నాస్తి అంటూ ఆపద సమయంలో ఆశ్రయించేది ఆ దేవదేవునినే ! ఆర్ధిక సమస్యలు, అనారోగ్యం, విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం ఇలా ఎన్నో సమస్యలతో పరిష్కారం ప్రసాదించమని కోరుకొంటుంటారు. ఈ వరస ఆలయాలు అలాంటి సమస్యల నుండి కావలసిన విముక్తుని ప్రసాదిస్తాయని ఆయా క్షేత్ర గాధలు తెలుపుతున్నాయి.
వివిధ సమస్యలకు పరిహార స్థలాలు, జాతక రీత్యా ఎదురయ్యే ఇబ్బందులకు జన్మ నక్షత్ర మరియు రాశి ఆలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరెన్నో ఆలయాలు ఉన్నాయి. వీటిని ఒక రోజు లేదా నిర్దేశిత కాల వ్యవధిలో దర్శిస్తే అత్యుత్తమ ఇహ పరలోక ఫలితాలను భక్తులు అందుకోగలరని తెలుస్తోంది. ఈ రోజు ఆయా క్షేత్రాల వివరాలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. అతి త్వరలో పూర్తి వివరాలను అందించగలను.
1.పడాల్ పెట్ర స్థలాలు.
2. తేవర వైప్పు స్థలాలు.
3. పంచ బ్రహ్మ ఆలయాలు.
4. పంచ భూత క్షేత్రాలు.
5. పంచారామ ఆలయాలు.
6. పంచ అరణ్య / వన క్షేత్రాలు.
7. పంచ సభలు.
8. పంచ పులియూర్ లింగాలు.
9. పంచ నటరాజ స్థలాలు.
10. పంచ క్రోశి ఆలయాలు.
11. సదా అరణ్య క్షేత్రాలు.
12. సప్త స్దాన ఆలయాలు.
13. సప్త మాంగై ఆలయాలు.
14. సప్త విదంగ స్థలాలు.
15. అష్ట వీరట్ట క్షేత్రాలు.
16. నవగ్రహ స్థలాలు.
17. నవ కైలాసాలు.
18. నవ నందులు.
19. ద్వాదశ జ్యోతిర్లింగాలు.
20. శివాలయ ఒట్టం ఆలయాలు.
21. పంచ కేదారాలు.
22. భాస్కర క్షేత్రాలు
ఇవీ ఆ వివరాలు. వీటిల్లో చాలా ఆలయాలు తంజావూరు, కుంభకోణం, తిరునెల్వేలి, కన్యాకుమారి, చెన్నై పరిసరాలలో నెలకొని ఉన్నాయి. పంచారామ మరియు నవనందుల ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నవ నంది క్షేత్రాల వివరాల వ్యాసం ఇప్పటికే ఈ బ్లాగ్లో ఉన్నది.
వరస క్రమంలో క్షేత్రాల వివరాలు అందించగలను.
నమః శివాయ !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి