Sri Tilai Kali Amman Temple, Chidambaram

శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం, చిదంబరం వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయం స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ కలిగినది. చతుర్ముఖాలతో మరియు ఉగ్రరూపంతో కొలువైన శ్రీ తిలై అమ్మన్ మరియు శ్రీ తిలై కాళీ అమ్మన్ కృపాకటాక్షాల కొరకు మరియు జన్మ నక్షత్రవశాత్తు సంగ్రమించే ఇబ్బందులులను భక్తులు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. పడమర దిశగా ఉండే శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఆది దంపతుల మధ్య నెలకొన్న వివాదం త్రీవ్ర రూపం దాల్చినది. ఇద్దరిలో ఎవరు అధికం అన్న సమస్య తేలడానికి నృత్యాన్ని మాధ్యమంగా ఎంచుకొన్నారు. పోటీ హోరాహోరీగా సాగింది. నటరాజ ఓటమి తప్పదా అన్న శంక వీక్షకులలో తలెత్తినది. ఆ సమయంలో అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తూ స్వామి ఊర్ధ్య తాండవ నృత్యం చేయసాగారు. స్త్రీ అయినందున ఆ భంగిమ పెట్టలేక పరాజయాన్ని అంగీకరించింది. కానీ స్త్రీ సహజమైన ఉక్రోషంతో అలిగి భీకరమైన కాళీ రూపం దాల్చినది. విధాత ఆమెను ఓదార్చి శాంతింపచేశారు. శాంతించ...