Punnathur Kotta, Guruvayur
పూనత్తూరు కోట్ట ( గురుయాయూరు ) వీధి లోనికి ఏనుగు రాగానే చిన్న పెద్దా అన్న తేడా లేకుండా చూడటానికి ఉత్సాహపడతారు. తన భారీ కాయాన్ని నాలుగు స్తంభాల లాంటి కాళ్ళ మీద మూస్తూ నడకలో ఒక రకమైన అందాన్ని, గాభీర్యాన్ని ప్రదర్శిస్తూ పొడుగాటి తోన్దాన్ని అటూ ఇటూ కదుపుతూ కాసులు ఇచ్చిన వారిని ఆశీర్వదిస్తూ , చేతల లాంటి చెవులను, శరీరానికి తగని చిన్ని తోకను నిరంతరం ఊపుతూ సాగే గజ రాజ నగర పర్యటన ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అదే దేవస్థానం ఏనుగు అయితే ఆ శోభ మరింతగా ఉంటుంది. నుదుటన నామాలు, చక్కని అలంకరణ, ముపురాన అమ్బారీలో దేవదేవుని ఉపస్తితుని గా చేసుకొని మావటి సూచనలకు అనుగుణంగా మందగమనంతో సగర్వంగా నడుస్తూ ఊరేగింపుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మన రాష్ట్రంలో దాదాపుగా లువు కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లోని అన్ని ప్రముక దేవస్తానాలలో గజం ఉండటం తప్పనిసరి. కేరళలో అయితే చెప్పనక్కరలేదు. ఈ దేవతల స్వస్థలంలో ఆలయాల సంస్కృతి, సంప్రదాయాలు,ఉత్సవాలు ఏనుగులతో అవినాభావ స...