Nilakkal Mahadeva Temple


                           నిలక్కాల్ శ్రీ మహాదేవ ఆలయం, శబరిమల  

శబరిమల యాత్రలో దర్శనీయ స్థలాలలో నిలక్కాల్ ఒకటి. 
పంబా నదికి సుమారు ఇరవై అయిదు కిలోమీటర్ల ముందే వస్తుందీ ప్రాంతం. 
ముఖ్యంగా నవంబర్ నుండి జనవరి వరకు అత్యంత అధిక సంఖ్యలో  తరలి వచ్చే భక్తుల వాహనాలను ఆపి ఉంచే ప్రధాన స్థలం కూడా ఇదే !

పూర్తిగా అటవీ ప్రాంతం. ప్రశాంతతకు నిలయం. 
ప్రధాన రహదారి నుండి ఒక కిలోమీటరు కొండ పైన ఉంటుంది. 
ప్రయాణంలో అలసిపోయిన దీక్షాపరులు సేద తీరటానికి సకల సౌకర్యాలు లభిస్తాయి. 

























పులి పాల వంకతో అరణ్యానికి తరలి వెళ్ళిన శ్రీ అయ్యప్ప దారిలో హరుని ఆరాధించిన స్థలం ఇదే !



కన్నిమూల గణపతి పడమర ముఖంగా ఉపాలయంలో కొలువుతీరి ప్రధమ పూజలు అందుకొంటుంటాడు.
ప్రస్తుతం పునః నిర్మాణ పనులు జరుగుతున్నప్రధాన ఆలయంలో చిన్న లింగ రూపంలో శ్రీ మహాదేవుడు దర్శనమిస్తారు.
 స్వామిని భక్తులు ఉగ్రరూపునిగా మరియు మంగళ దాయకునిగా కూడా భావిస్తూ ఆరాధిస్తారు.
ప్రతినిత్యం త్రికాల పూజలు సర్వేశ్వరునికి జరుపుతారు.
ఆది, సోమ మరియు శుక్ర వారాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు మరియు హోమాలు జరిపించుకోడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.


సదాశివుని సన్నిధికి వెనుక కొద్ది దూరంలో శ్రీ పల్లియరక్కావు దేవి ఆలయం ఏర్పరచబడినది. 
దుర్గా అవతారమైన ఈమె గ్రామ దేవతగా కేరళ లోని అనేక గ్రామాలలో కొలువై ఉన్నది. 







రద్దీ తక్కువగా ఉన్న రోజులలో నిలక్కాల్ అందాలను, ప్రశాంతతను చక్కగా ఆస్వాదించవచ్చును.
సంక్రాంతి నాడు కనిపించే  మకర జ్యోతిని  ఇక్కడి నుండి కూడా వీక్షించవచ్చు.



భావి తరాలకు అడవులను అందులో జీవించే జంతువులను  అందించడానికి  ఇక్కడ తీసుకొనే జాగ్రతలు ఎన్నో !


నమః శివాయ !!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore