పోస్ట్‌లు

నవంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Dharma Sastha Temple, Pakkil

చిత్రం
పక్కిల్ శ్రీ ధర్మ శాస్త ఆలయం శ్రీ ధర్మశాస్త సంప్రదాయము, ఆరాధనకు కేంద్రమైన కేరళలోని వివిధ ప్రాంతాలలో మొత్తం నూట ఎనిమిది శాస్త ఆలయాలు నెలకొల్పబడినాయి. అన్నింటినీ శ్రీ పరశురాముడు ప్రతిష్టించినట్లుగా పురాణ గాధలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రాలన్నీ  ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. వీటిల్లో కొన్ని చోట్ల స్వామి తన యోగముద్ర భంగిమలో కాకుండా ఇతర భంగిమలలో కొలువై ఉంటారు.  అసలు దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను సృష్టించిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించి స్థాపించిన శ్రీ ధర్మశాస్త ఆలయాలు ఎనిమిది మాత్రమే అని కొందరు అంటారు. ఆ ఎనిమిది క్షేత్రాలలో కొట్టాయం కు చేరువలో ఉన్న పక్కిల్ గ్రామంలో ఉన్న ఆలయం ఒకటిగా పేర్కొనబడినది.  శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు శ్రీ ధర్మశాస్తాను క్షేత్ర రక్షకునిగా నియమించారట.  అందుకనే కేరళ లోని అన్ని ఆలయాలలో శ్రీ ధర్మశాస్త ఉపాలయంలో దర్శనమిస్తారు. మహిళలు ఈ ఉపాలయాలలోని స్వామిని దర్శించుకొనవచ్చును. కానీ ముఖ్యమైన క్షేత్రాలైన   శబరిమల, అరియంగావు, అచ్ఛంకోవిల్, కులత్తపుల, శాస...

Sri Kailasanathar Temple,Thara Mangalam, Salem

చిత్రం
                         శ్రీ కైలాస నాథర్ ఆలయం, తారమంగళం   To,   వినాయకుడు సదాశివుడు, శ్రీ హరి, అమ్మవారు, కుమార స్వామి ఇలా దేవుడు లేదా దేవత ఎవరు కొలువుతీరినా సుందర  శిల్ప శోభ మాత్రం అద్వితీయంగా దర్శనమీయడం తమిళ నాడులోని ఆలయాలలో ప్రస్పుటంగా కనపడుతుంది. దానికి మరో ఉదాహరణ "ధారైమంగళం "గా గతంలో పిలవబడి నేడు " తార మంగళం" పిలవబడుతున్న ఊరిలోని   "శ్రీ కైలాస నాథర్ ఆలయం ". ఆలయ గాధ పరమేశ్వరుడు కొలువైన అనేక క్షేత్రాలలో వినిపించేదే ! సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట స్థానిక రాజుగారి గోవుల మంద లోని ఒక ఆవు నిత్యం ఒక ప్రదేశంలో తన పొడుగు నుండి పాలను ధారగా వదులుతుండేదట. కారణాన్ని అన్వేషించే క్రమంలో అక్కడ తవ్వగా శివ లింగం లభించినదట. రాజు తన అదృష్టానికి పొంగిపోయి సాక్షాత్ కైలాస  వాసుడే సాక్షాత్కరించాడని స్వామిని " కైలాస నాథర్ "గా పేర్కొంటూ ఆలయాన్ని నిర్మించాడట. ఆలయంలో పాలు విడుస్తున్న గోవు శిల్పాలు చాలా స్తంభాల మీద కనపడతాయి.  తదనంతర కాలంలో పల్లవ, చోళ, ...