18, జులై 2014, శుక్రవారం

Mypad Beach, Nellore

   మైపాడ్ బీచ్, నెల్లూరు 

చారిత్రక, రాజకీయ విశేషాల నిలయం అయిన నెల్లూరు జిల్లాలో విస్తారమైన సముద్ర తీరం ఉన్నది. 
కొద్దికాలం లోనే పేరొందిన "కృష్ణ పట్నం ఓడ రేవు" ఇక్కడే కలదు. 
ఆనతి కాలం లోనే మరికొన్ని ఓడ రేవులు స్థాపించే అవకాశం కనిపిస్తోంది. 
దుగారాజ పట్నం వాటిల్లో ఒకటి. 
పర్యాటకులకు ఆటవిడుపుగా ఒక శెలవు దినాన్ని ఆనందంగా గడపాలంటే "మైపాడ్ బీచ్" కి వెళ్ళాలి. 
నెల్లూరు పట్టణానికి సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి రోడ్ మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. 
దారికిరుపక్కలా పచ్చని పొలాలు, ఏపుగా పెరిగిన కొబ్బరి, మామిడి ఇతర పండ్ల తోటలు ప్రకృతి ప్రియుల హృదయాలకు అమరిమిత ఆనందాన్ని కలిగిస్తాయి. 
ఏ కోనసీమ లోనో, కేరళ లోనో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడి వాతావరణం. 



బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ వారి అధ్వర్యంలో హరిత బీచ్ రిసార్ట్ ఏర్పాటు చేయబడినది. 
ఇందులో పర్యాటకుల సౌకర్యార్ధం కావలసిన ఏర్పాట్లు చేయబడ్డాయి. ( విచ్చల విడి మద్యం అమ్మకాలను, బీచ్ లో సేవించడానిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది). 
ప్రతి నిత్యం ముఖ్యంగా శెలవ దినాలలో వేలాదిగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 
అంత ప్రమాదకరం కాని అలలతో అందర్నీ ఆకర్షించే సాగరం మైపాడు సొంతం. 
పిల్లలకు గుఱ్ఱపు స్వారి ఉన్నది. 










 బృందాలుగా లేక ఒక్కరే  సముద్రంలో విహరించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
శీతాకాలంలో కొన్ని చోట్ల "డాల్ఫిన్" చేపలు కనపడతాయి అని అంటారు.
ఉత్సాహవంతులు చేపల వేటకు సాగరం లోనికి ప్రత్యేక బోటు లలో వెళుతుంటారు.





రుచికరమైన ఆహారాన్ని అందించే పలహరశాలలను, మరికొన్ని ఆటలకు తగిన ఏర్పాట్లు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కుటుంబ, మిత్రులతో ఒక శలవు దినాన్ని ఆహ్లాదంగా గడపటానికి తగినది మైపాడ్ బీచ్.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...