18, జులై 2014, శుక్రవారం

Indukurupet Temples

         శ్రీ యోగాంజనేయ మరియు శ్రీ సాయిబాబా మందిరాలు. కొత్తూరు 

నెల్లూరు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందుకూరుపేట మండలం లోని కొత్తూరు గ్రామంలో స్థానిక వ్యాపారి ఒకరు నూతనంగా నిర్మించిన రెండు అద్భుత మందిరాలు శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ యోగాంజనేయ స్వామి.  

తూర్పు పడమర దిశలలో ఒకదానికి ఒకటి ఎదురుగా చక్కని ప్రశాంత సుందర  పల్లె ప్రకృతి వాతావరణం లో ఉండే ఈ మందిరాలు రమణీయ శిల్పాలతో ఉప ఆలయాలతో నిర్మించబడినాయి.
శ్రీ షిరిడి సాయి బాబా ఆలయం పడమర ముఖంగా శ్రీ గణేష, శ్రీ ధర్మశాస్త, శ్రీ దత్తాత్రేయ మరియు నవగ్రహ మండపం తో పాటు శ్రీ బాబా కు ప్రియమైన ధుని కలిగి ఉంటుంది.
మందిరం లోపల షిరిడి లోని విగ్రహాన్ని తలపించే బాబా విగ్రహం నయన మనోహరంగా దర్శనమిస్తుంది.
ప్రతి నిత్యం నియమంగా నాలుగు హారతులు ఇతర సేవలు బాబా కు జరుగుతాయి.










 తూర్పు ముఖంగా నిర్మించబడిన శ్రీ యోగాంజనేయ స్వామి వారి మందిరంలో వెలుపలి ప్రదక్షిణ ఫదంలో అనేక దివ్య క్షేత్రాల దేవి దేవతల రూపాలను, కుబేరుని లాంటి దిక్పాలక మరియు మహర్షుల విగ్రహాలను నెలకొల్పారు.









































లోపల ఎత్తైన పీఠం మీద పన్నెండు అడుగుల పాల రాతి నిర్మిత శ్రీ యోగాంజనేయ స్వామి రూపం భక్తులను మైమరపించి ఆధ్యాత్మిక లోకాలలో విహరించేలా చేస్తుంది.
నిత్యం వివిధ పూజలు స్వామి వారికి నియమంగా జరుగుతాయి.
ప్రతి నిత్యం ఎందరో భక్తులు సందర్శిస్తుంటారు. 
శలవ, పర్వ దినాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 
మైపాడ్ బీచ్ వెళ్ళే వారంతా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దర్శించుకొంటారు. 
నూతనంగా నిర్మించబడినా పరిపూర్ణ భక్తి భావాన్ని పెంపొందించే వాతావరణం ఈ మందిరాల సొంతం. 
నిర్మించిన వారు ఎంతైనా అభినందనీయులు. 
సమర్ధ సద్గురు సాయి నాద మహారాజ్ కి జై !!!
శ్రీ ఆంజనేయం !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...