శ్రీ మందగిరి శ్రీ శనీశ్వర స్వామి, కనుమలోపల్లి ( సిద్ధవటం మండలం )
సమస్త లోకాలలోని జనుల మీద సమయం వచ్చినప్పుడు తన ప్రభావాన్ని చూపించే వాడు శని భగవానుడు.
ఏదోరకంగా ఈయనను ప్రసన్నుని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడతారు.
తైలాభిషేకాలు, దానాలు, జపాలు, ప్రదక్షిణలు ఇలా ఎన్నో చేస్తుంటారు.
ప్రజలను ఇంతగా ఆందోళనకు ( ఒక రకంగా భయానికి ) గురిచేసే శనికి ఉన్న ఆలయాలు మాత్రం చాలా తక్కువ.
ఉన్న వాటిల్లో కూడా సదా శివుడే లింగ రూపంలో మందేశ్వరునిగా అభిషేకాలు అందుకొంటారు.
మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శనీశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా మండవిల్లిలో ఉన్నది.
ఇది కోస్తా జిల్లాల వారికి సదుపాయంగా ఉంటుంది.
కాని రాయల సీమ వాసులు కడప, కర్నూల్, అనంత పురం వాసులు కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శని క్షేత్రం అయిన "పావగడ" వెళుతుంటారు.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్ళే భక్తుల కొరకు స్థానికంగా ఒక శని భగవానుని ఆలయం నిర్మిస్తే బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో ఒక భక్తుడు చేసిన పరిశోధన పలితమే శ్రీ మందగిరి శనీశ్వర స్వామి దేవస్థానము.
కడప పట్టణానికి చేరువలో తిరుపతి వెళ్ళే దారిలో ఉన్న కనుమలో పల్లి గ్రామంలో డాక్టర్ శ్రీ యస్. సుబ్రహ్మణ్యం గారు ఈ ఆలయాన్ని నిర్మించారు.
సదాశయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమయ్యింది.
శ్రీ గణపతి, శ్రీ హనుమాన్, శ్రీ పార్వతి సమేత పరమేశ్వర, శ్రీ షిరిడి సాయి మందిరాలతో పాటు అనేక నాగ ప్రతిష్టలు ఉంటాయి.
ప్రధాన ఆలయంలో అయిదు అడుగుల ఎత్తైన శ్రీ శని భగవానుని విగ్రహం సుందరంగా ఉంటుంది.
అన్ని పర్వ దినాలను జరుపుతారు.
శని త్రయోదశి రోజున విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయి. భక్తులకు అన్నదానం చేస్తారు.
తిరుపతిని కలిపే మార్గంలో ఉన్నందున యాత్రికులు విశ్రాంతి తీసుకోడానికి, సేద తీరడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసిన డాక్టర్. సుబ్రమణ్యంగారు ఎంతో అభినందనీయులు.
కడప చుట్టు పక్కల ఎన్నో పురాణ ప్రసిద్ది చెందిన క్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి. అందులో ఈ క్షేత్రాన్ని తప్పక చేర్చాలి.
నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్
చాయామార్తండ సంభూతం తం నమామి శనీశ్వరం !
aalaya poojarini ela smpradinchalo teliya cheyagalara please
రిప్లయితొలగించండి