17, మే 2013, శుక్రవారం

KUDERU

కుడైర్ లేక కూడేరు గ్రామం అనంతపురం నగరానికి సుమారు యిరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
రాయలసీమ గ్రామీణ వాతావరణానికి ప్రతీక అయిన కూడేరులో చరిత్ర ప్రసిద్ది చెందిన శివాలయం కలదు. శ్రీ సంగమేశ్వర స్వామి లేక జోడు లింగాల ఆలయంగా పిలవబడే ఈ దేవాలయం పదో శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది.
ఈ ఆలయానికి ఎంతో పౌరాణిక విశేషాలతో కూడిన నేపద్యం ఉన్నది. 

ఆలయ గాధను తెలిపే శిలాశాసనాలను ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అవి తెలుగులో ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. 

ఊరికి దూరంగా విశాల ప్రాంగణంలో తూర్పు దిశగా ఉన్న ఈ పురాతన ఆలయానికి చిన్న గోపురం ఉన్నది. 
ఈశాన్యంలో నవగ్రహ మంటపం కలదు. 
తూర్పు గోపురం 
ఆలయ అంతర్భాగంలో మండపాలు నిర్మించారు. తూర్పు,పడమరలలో రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. పడమర దిశలో ఉన్న గోపురానికి అనుభందంగా ఉన్న మడపంలో శివ లింగాన్ని ఉంచారు. 

బలి పీఠం, ధ్వజస్తంభం దాటిన తరువాత ముఖ మడపం ఉంటుంది. 
గర్భాలయంలో శివ పార్వతులిద్దరూ రెండు లింగ రూపాలలో దర్శనమిస్తారు. 
అర్ధనారీశ్వరుడు అన్నదానికి నిదర్శనంగా ఆది దంపతులిరువురు ఒకే పాను వట్టం మీద లింగ రూపులై భక్తుల అభిషేకాలు,పూజలు కలసి అందుకొంటారు. ఇక్కడ రాహు కేతు పూజలు ప్రత్యేకం. శివరాత్రి, కార్తీక మాస పూజలు,  మాస శివరాత్రి విశేషంగా జరుపుతారు. వినాయకుడు ప్రత్యెక సన్నిధిలో కొలువై ఉంటారు. 
జిల్లా నుండే కాకుండా ప్రక్కనే ఉన్న కర్ణాటకా నుండి కూడా భక్తులో ప్రతి నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో మరుగున పది ఉన్న ఆనేకానేక పురాతన ఆలయాలో కూడేరు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటి. 

కూడేరుకు అనంతపురం పట్టణం నుండి ప్రతి పది నిముషాలకి బస్సు సౌకర్యం కలదు. రాష్ట్రంలోని అన్ని నగరాలనుండి ఇక్కడికి చేరుకోవచ్చును. 
ఓం నమశివయః 

1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...