పోస్ట్‌లు

జనవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

Only One Brahma Temple, Chebrolu

చిత్రం
  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోకంలో ఆలయాలలో కొలువుతీరి భక్తుల సేవలు అందుకుంటూ కొలిచిన వారిని కాపాడుతున్నారు.  కానీ సృష్టికర్త బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం లేకపోవడం చెప్పుకోవలసిన విషయం. విధాతకు పూజార్హత లేకపోవడానికి సంబంధించి కొన్ని గాధలు వినిపిస్తాయి. అసత్యమాడినందుకు కైలాసనాధుడు ఇచ్చిన శాపం కారణంగా చెబుతారు.  మరో గాథ ప్రకారం త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్నీ కనుగొనడానికి మహర్షుల కోరిక మీద సత్య లోకానికి వెళ్లిన భృగు మహర్షి తనను పట్టించుకోని కమలాసనునికి భూలోకంలో పూజలు ఉండవని శపించారని తెలుస్తోంది.  ఈ రెండు గాధల సారాంశం ఏమిటంటే బ్రహ్మ దేవువునికి భూలోకంలో పూజలు చేయరు అన్నదే! చిత్రంగా కొన్ని క్షేత్రాలలో హంసవాహనుడు కొలువై పూజలు అందుకోవడం కనపడుతుంది. వాటిల్లో విశేషమైనది రాజస్థాన్ రాష్ట్రంలోని "పుష్కర" క్షేత్రం.  అదే విధంగా తమిళనాడు మరియు కేరళలో కొన్ని క్షేత్రాలలో సృష్టికర్త కొలువై ఉండటం కనిపిస్తుంది.  మన రాష్ట్రంలో కూడా ఒక బ్...