Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka
మరుగునపడిన మహా క్షేత్రం ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ పఠన మరియు శిలా శాసనాలను పరిశీలన చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం ప్రయాసపడుతూ సందర్శించే క్షేత్రాలు ఒకప్పుడు గొప్ప తీర్థ పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్దికెక్కినవి అని గ్రంధాలు మరియు శాసనాలు తెలుపుతాయి. అంటే గతంలో నేటి చిన్న చిన్న గ్రామాలు నిరంతరం భక్తుల రాకపోకలతో సందడిగా నిత్య పూజలతో, ఉత్సవాలతో శోభాయమానం గా ఉండేవని తెలుస్తుంది. ఈ ఉపోద్ఘాతం వెనుక ఉన్న విషయం నేడు మరుగున పడిపోయిన ఒక విశేష క్షేత్ర ప్రాధాన్యత తెలుపడానికి చేస్తున్న ప్రయత్నంలో దొరికిన హృదయాలను కలచివేసే సమాచారం. దక్షిణ భారత దేశ ప్రత్యేకత సువిశాల మన దేశం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా భాష, ఆచారవ్యవహారాలు, ఆహార విహారాలు మరియు నిర్మాణశైలి విషయంలో ఉత్తర మరియు దక్షిణ భారత దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనపడతాయి. దక్షిణ భారత దేశంలో నేడు ఉన్న ఆరు రాష్ట్...